వివరణ కోరిన బర్నింగ్ ఆడి ఆర్8 సూపర్ కార్ ఓనర్

కోట్ల రూపాయల ఖరీదు చేసే కారు తన కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోవటంతో, దిగ్భ్రాంతికి గురైన భవేష్ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను తనకు వివరించాలంటూ ఆడి కంపెనీకు ఓ ఈ-మెయిల్‌ను పంపాడు. ఆడి కంపెనీ అధికారులు వ్యాఖ్యానించినట్లుగా, తాను తన కారులో ఎలాంటి ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్లు చేయించలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా, దేశంలో ఇలాంటి కార్లను ఉపయోగిస్తున్న ఇతర ఆడి ఆర్8 యజమానుల గురించి కూడా భవేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
తన లాగే ఇతర ఆడి ఆర్8 కార్ యజమానులు నష్టపోకుండా ఉండేందుకు, వెంటనే తమ కార్లను పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆడి ఆర్8 కారులో మంటలు చెలరేగటం ఇదే మొదటిసారి కాదని దుబాయ్, టొరంటోలలో కూడా ఆడి ఆర్8 కార్లు అగ్నికి ఆహుతయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ కారు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆడి ఇండియా దర్యాప్తు నిర్వహిస్తోంది. గత ఆదివారం ముంబైలో పార్క్స్ సూపర్‌కార్ పెరేడ్ 2013 జరుగుతుండగా ఈ సంఘటన జరగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








