మీరు కారు కొనండి... మేము ఈఎమ్ఐ కడతాం..

By Ravi

ఫైనాన్సులో కారు కొనడం సులువే. కొంత మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ (నెలవారీ సులభ వాయిదా)లో చెల్లించేటట్లు కారును కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎమ్ఐ చెల్లించాలంటే కొన్ని సందర్భాల్లో క్లిష్టంగా మారుతుంటుంది. అలాంటప్పుడు మనకు బదులుగా ఈఎమ్ఐను వేరే ఎవరైనా చెల్లిస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది కదా..! మరి అలా జరగాలంటే మనం డ్రీమర్స్ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ వాళ్లని కలుసుకోవాలి.

డ్రీమర్స్ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీ 'అవుట్ ఆఫ్ హోమ్' (ఓఓహెచ్) అనే ఓ విశిష్టమైన స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా, డ్రీమర్స్ ద్వారా కారు కొనాలనుకునే కస్టమర్లు కారు ధరలో 25 శాతాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, 5 ఏళ్ల ఈఎమ్ఐ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటి 3 ఏళ్లు కస్టమర్ ఒక్క రూపాయి కూడా ఈఎమ్‌ఐను చెల్లించాల్సిన అవసరం లేదు, దానిని డ్రీమర్స్ వారే చెల్లిస్తారు. మిగిలిన 2 ఏళ్ల ఈఎమ్ఐను మాత్రమే కస్టమర్లు చెల్లించాల్సి ఉటుంది.

దీనివలన డ్రీమర్స్‌కు వచ్చే లాభం ఏంటనుకుంటున్నారా..? అక్కడే అసలు కథ దాగుంది. డ్రీమర్స్ ఈఎమ్ఐ చెల్లించే 3 ఏళ్ల కాలం వరకు కస్టమర్ కారుపై 40-60 శాతం స్థలాన్ని ప్రకటనల కోసం ఉపయోగించుకుంటుంది. డ్రీమర్స్ వివిధ సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల ప్రకారం, ఓఓహెచ్ స్కీమ్ ద్వారా కస్టమర్లు కొనుగోలు చేసిన కార్లపై ప్రకటనల స్టిక్కర్లను అంటిస్తుంది. కస్టమర్లు తమ కార్లను శుభ్రంగా, ఉంచుకుంటూ, వీటిని తొలగించకుండా ఉండాలి. ప్రతినెలా కనీసం సగటున 1500 కి.మీ. ప్రయాణించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Buy A Car Through Dreamers And Get 3 Years Free EMI

కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగారో తెలిపేందుకు కారుకు ఓ విటిఎస్ పరికరాన్ని అమర్చుతారు (దీన్ని కూడా ట్యాంపర్ చేయకూడదు). ఈ విధంగా ప్రకటనలు చేయటం వలన సదరు ప్రకటనకు సంబంధించిన కంపెనీల నుంచి డ్రీమర్స్‌కు కొంత మొత్తం ముడుతుంది. ఇలా వచ్చిన మొత్తంలో నుంచి కొంత మొత్తాన్ని కస్టమర్లు కారును కొనుగోలు చేసేటప్పుడు 3 ఏళ్ల పాటు ఈఎమ్ఐ చెల్లించడం కోసం డ్రీమర్స్ వినియోగిస్తుంది. ఈ కాంట్రాక్టు పూర్తయిన తర్వాత కస్టమర్లు తమ కారును తమకు నచ్చిన విధంగా స్టిక్కర్లను తొలగించి వాడుకోవచ్చు.

రూ.6 లక్షల రేంజ్‌లో కారును కొనాలనుకునే తక్కువ ఆదాయం కలిగిన (వార్షిక ఆదాయం రూ.10 లక్షల కన్నా తక్కువ కలిగిన వారు) వారిని దృష్టిలో ఉంచుకొని, వారిపై పడే అధనపు ఈఎమ్ఐ భారాన్ని తప్పించేందుకు, అలాగే వివిధ కంపెనీల ఉత్పత్తులకు బహుళ ప్రచారాన్ని కల్పించేందుకే డ్రీమర్స్ ఈ స్కీమ్‌ను అందిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని తెలుసుకోవాలనుకునే వారు [email protected] ఈ-మెయిల్ ఐడి ద్వారా డ్రీమర్స్‌ను సంప్రదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2013, 11:16 [IST]
English summary
Dreamers media and advertising launches a revolutionary concept in the OOH space. Consumers who wish to purchase a car through Dreamers can avail of the offer by paying a 25% down payment with EMI tenure of 5 years. Dreamers will pay the EMIs for the first three years while the consumer will make the payments for the last two years; in return Dreamers will utilize 40 – 60 % of the customer’s car space. This space is the commercial driver for Dreamers, which will then sign up both long and short term contracts with interested advertisers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+