స్కొడా ర్యాపిడ్ సెడాన్‌పై ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్
విశిష్టమైన ఫైనాన్స్ ఆఫర్లను అందజేయాలంటే, అది స్కొడా ఇండియాకే చెల్లుతుంది. స్కొడా అందిస్తున్న పాపులర్ సెడాన్ 'ర్యాపిడ్' కోసం కంపెనీ మరోసారి ఓ ప్రత్యేమైన ఫైనాన్స్ స్కీమ్ ప్రవేశపెట్టింది. 'నేడు స్కొడా ర్యాపిడ్‌ను కొనండి, ఈఎమ్ఐను 2015లో చెల్లించండి' అంటూ, స్కొడా ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తుంది.
ఈ స్కీమ్‌లో భాగంగా, కొంత డౌన్‌పేమెంట్ కట్టి, ఇప్పుడు స్కొడా ర్యాపిడ్ కారును బుక్ చేసుకునే వారు, మొదటి ఈఎమ్ఐను 2015లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఈ ఒక్క ఏడాది కస్టమర్లు ఎలాంటి ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట.

ఉదాహరణకు.. 'స్కొడా ర్యాపిడ్ యాంబిషన్ 1.6 ఎమ్‌పిఐ ఎమ్‌టి ప్లస్' వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫైనాన్స్ స్కీమ్ బ్రేకప్ క్రింది విధంగా ఉంటుంది.
| ఎక్స్-షోరూమ్ ధర (న్యూఢిల్లీ) | రూ. 7,74,325 |
| డౌన్‌పేమెంట్ | రూ. 1,54,865 |
| రుణ మొత్తం | రూ. 6,19,460 |
| రుణ కాలవ్యవధి | 48 నెలలు |
| 01-12 నెలలు | 13-24 నెలలు | 25-47 నెలలు | 48వ నెల |
| రూ.1 | రూ.15,000 | రూ.22,222 | రూ.24,681 |
ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా ఆటో ఇండియా డీలరును సంప్రదించండి.
స్కొడా ర్యాపిడ్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 183 కి.మీ.
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/sRdUOVHFh9o?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>
టాప్-ఎండ్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








