హ్యుందాయ్ ఐ20 కొనండి, సింగపూర్ హాలిడే ట్రిప్ గెలుచుకోండి
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా 'జాయ్‌ఫుల్ జులై' ఓ సరికొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా జులై నెలలో హ్యుందాయ్ ఐ20 కారును కొనగోలు చేసిన వారికి, పూర్తి ఖర్చులు చెల్లించే ప్యాకేజీతో కూడుకున్న సింగపూర్ హాలిడే ట్రిప్‌ను గెలుచుకునే అవకాశాన్ని కంపెనీ కలిపిస్తోంది (ఇద్దరు వ్యక్తులు లేదా భార్యాభర్తలు).
అంతేకాకుండా, సరికొత్త ఐ20 కారుపై హ్యుందా రూ.30,000 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలరును సంప్రదించండి. (షరతులు వర్తిస్తాయి).

హ్యుందాయ్ ఐ20 విషయానికి వస్తే.. హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ 12 వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో ఐదు డీజిల్ వేరియంట్లు, ఏడు పెట్రోల్ వేరియంట్లలో లభ్యమవుతాయి. కొత్త ఐ20 మూడు విభిన్నమైన ఇంజన్లు (1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్), రెండు ఫ్యూయెల్ ఆప్షన్ (పెట్రోల్, డీజిల్), మూడు ట్రాన్సిమిషన్ ఆప్షన్ (5-స్పీడ్, 6-స్పీడ్, ఆటోమేటిక్) లతో లభిస్తుంది.
ఐ-జెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయెల్ విటివిటి (వేరియబుల్ వాల్వ్ టైమింగ్) టెక్నాలజీతో కూడిన రీఫైన్ చేయబడిన శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పాత వేరియంట్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి శక్తిని (పవర్)ను 80 పిఎస్‌ల నుండి 84 పిఎస్‌లకు పెంచడం జరిగింది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.5 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
మిగిలిన రెండు ఇంజన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్) వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. హై-టెక్ 1.4 యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ లభిస్తుంది. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరు డీజిల్‌కు 21.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
ఆటోమేటిక్ వేరియంట్లో లభ్యం కానున్న హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20లో 1.4 లీటర్ గమ్మా పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 13.9 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఆటోమేటిక్ వేరియంట్ ఐ20 లీటరు పెట్రోల్‌కు 15 కి.మీ. మైలేజీనిస్తుందని హ్యుందాయ్ తెలిపింది.


Click it and Unblock the Notifications








