దేశంలోనే అతిపెద్ద కార్ల స్కామ్: ఖజానాకు రూ.50 కోట్ల నష్టం

తమిళనాడులో శుక్రవారం జరిపిన దాడుల్లో సిబిఐ స్వాధీనం చేసుకున్న 33 కార్లలో 11 కార్లు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందినవిగా తెలుస్తోంది. కార్ల దిగుమతి కుంభకోణం భారతదేశంలోనే ఈ తరహా కుంభకోణాల్లో అన్నిటికంటే ఇదే అతిపెద్ద కుంభకోణం కావచ్చని సిబిఐ భావిస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్కామ్‌లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్‌ఐ) అధికారులు కూడా ఉన్నట్లు సిబిఐ పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో, ప్రముఖలతో పాటు అనేకమంది డిఆర్‌ఐ అధికారుల నివాసాలపై కూడా సిబిఐ దాడులు జరిపింది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, కార్ల దిగుమతి వ్యాపారం చేసే అలెక్స్ జోసెఫ్ అరెస్ట్ చేస్తారనే భయంతో పరారీ అయ్యాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిని దిగుమతి చేసుకున్న హమ్మర్ కారు కోసం సిబిఐ ఆయన నివాసంపై దాడులు జరిపింది. మరో తమిళ నటుడు విజయ్ దిగుమతి కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కోసం కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








