రూపీ ఎఫెక్ట్: పెరగనున్న కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు

By Ravi

Car Insurance
డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ భారీగా క్షీణిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పుడు ఇదే అంశం దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాలను చూపుతోంది. పతనమవుతున్న రూపాయి విలువ కారణంగా, వాహనా బీమా ప్రీమియంలు కూడా పెరగనున్నాయి.

రూపాయి విలువ పతనం కారణంగా దిగుమతి చేసుకునే విడి భాగాల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని, అందుకు దీటుగా తమపై క్లెయిమ్‌ల భారం కూడా పెరుగుతుంది గనుక ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదన్నది బీమా కంపెనీలు అంటున్నాయి.

సాధారణంగా కారు ధరను బట్టి బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుందని, అయితే ఇటీవల కాలంలో కార్ల తయారీలో ఉపయోగించే కొన్ని దిగుమతి చేసుకునే విడిభాగాల ఖరీదు పెరగడంతో ఆటో కంపెనీలు ఆయా కార్ల ధరలను పెంచుతున్నాయి.

కారు ధర పెరగితే ఆటోమేటిక్‌గా దాని బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, కార్ల బీమా ప్రీమియం 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు గత 6 నెలలుగా ఉత్పత్తి సంస్థల్లో కార్మిక వ్యయాల సగటు 10 శాతం నుంచి 15 శాతం పెరిగిందని, ఫలితంగా ప్రీమియం పెంచడం తప్ప తమకు మరో మార్గం లేదని బీమా కంపెనీలు చెబుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 11, 2013, 14:11 [IST]
English summary
Car insurance premiums may rise in days ahead as the cost of imported spare parts has increased in the recent months because of sharp depreciation of the rupee.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+