వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు

ఈ నేపథ్యంలో, వాహణ రుణాలపై కనీసం 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును తగ్గించాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. ఈ విషయమై కొటక్ మహీంద్రా ప్రైమ్ సీఈఓ వ్యోమకేశ్ కాపాశి వ్యాఖ్యానిస్తూ.. వడ్డీ రేట్లు తగ్గించి కొత్తగా రుణాలు మంజూరు చేస్తే తప్ప కార్ల అమ్మకాలు పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం బ్యాంకులు కనీసం 25 మౌలిక పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) అంచనాల ప్రకారం, కార్ల అమ్మకాలు 9 నెలల కనిష్టానికి పడిపోవచ్చునని అంచనా. డిసెంబర్ నెలలో కార్ల అమ్మకాలు 12.5 శాతం తగ్గాయి. గడచిన ఆగస్టు నెల (18.56 శాతం) తర్వాత ఇంత గరిష్ట మొత్తంలో అమ్మకాలు క్షీణించడం ఇదే మొదటిసారి. దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ ఎస్‌బిఐ ఈ విభాగం (ఆటో లోన్స్)లో 30 శాతం వృద్ధిని కనబరిచింది. ఇందుకు ప్రధాన కారణంగా ఎస్‌బిఐ కార్ లోన్స్‌పై సదరు బ్యాంక్ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే. అక్టోబర్ 2012 నాటికి ఈ సెగ్మంట్లో ఎస్‌బిఐకు 20 శాతం మార్కెట్ వాటా ఉంది.
ఇదే సమయంలో ప్రవేట్ బ్యాంకుల వాటా మాత్రం తగ్గిపోయింది. ఇందుకు కారణం సదరు ప్రైవేట్ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటమే. ఏదేమైనప్పటికీ, రానున్న నెలల్లో వాహన రుణాలపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన వాహన ఫైనాన్సింగ్ విభాగం కోటక్ మహీంద్ర ప్రైమ్‌అన్ని రకాల ప్యాసింజర్ వాహనాలకు ఫైనాన్స్, రుణ సదుపాయాలను అందిస్తోంది. కోటక్ మహీంద్రా ఇప్పటికే కార్ల రుణాలపై వడ్డీ రేట్లను 25-50 పాయింట్లు తగ్గించింది.


Click it and Unblock the Notifications








