కార్ల కంపెనీలకు కలిసిరాని పండుగ సీజన్
ఈ పండుగ సీజన్ కార్ల కంపెనీలకు ఆశాజనక ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది. అఖిల భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2012 నెలతో పోల్చుకుంటే అక్టోబర్ 2013లో మొత్తం కార్ల అమ్మకాలు 3.88 శాతం క్షీణించి 1,69,788 యూనిట్ల నుంచి 1,63,199 యూనిట్లకు పడిపోయాయి.
అయితే, ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి. అక్టోబర్ 2012 నెలతో పోల్చుకుంటే అక్టోబర్ 2013లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు (మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు కలిపి) 18 శాతం వృద్ధి చెంది 12,85,015 యూనిట్ల నుంచి 15,16,291 యూనిట్లకు పెరిగాయి.

ఇదే కాలంలో మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 19.77 శాతం క్షీణించి 66,722 యూనిట్ల నుంచి 53,533 యూనిట్లకు పడిపోయాయి. అన్ని విభాగాలకు చెందిన మొత్తం వాహనాల అమ్మకాలను పరిగణలోకి తీసుకుంటే, అవి 12.56 శాతం వృద్ధిని కనబరచి 16,51,028 యూనిట్ల నుంచి 18,58,386 యూనిట్లకు పెరిగాయి.



Click it and Unblock the Notifications








