నవంబర్‌లో కూడా తగ్గిన కార్ల జోరు; ఆగని బైక్‌ల పరుగు

By Ravi

కార్ల కంపెనీలకు 2013 సంవత్సరం పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు క్షీణిస్తూనే వస్తున్నాయి. నవంబర్ నెలలో కూడా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఎప్పటి మాదిరిగా వృద్ధి బాటలో సాగుతున్నాయి. కానీ, గడచిన నవంబర్ నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాల వృద్ధి నామమాత్రమే అని చెప్పొచ్చు.

పండుగ సీజన్ కారణంగా, అక్టోబర్ నెలలో అమ్మకాలు కాస్తంత ఫర్వాలేదనిపించినప్పటికీ, తిరిగి నవంబర్ నెలలో మాత్రం ఇదివరకటి పరిస్థితే ఎదురయ్యింది. అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ, అవి కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోతున్నాయి. నవంబర్ 2013లో మొత్తం కార్ల అమ్మకాలు 8 శాతానికి పడిపోయాయి.

Car Sales November 2013

సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవంబర్ నెలలో దాదాపు అన్ని ప్రధాన కార్ కంపెనీలు రుణాత్మక వృద్ధినే కనబరచాయి. గడచిన నెలలో మారుతి సుజుకి అమ్మకాలు 4 శాతం పడిపోగా (71,649 యూనిట్లు), హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 4 శాతం పడిపోయాయి (33,427 యూనిట్లు). టాటా మోటార్స్ అమ్మకాలు కూడా భారీగా 42 శాతం పడిపోయాయి (7,910 యూనిట్లు).

ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, హీరో మోటోకార్ప్ అమ్మకాలు 6 శాతం పెరిగి 5.20 లక్షల యూనిట్లను విక్రయించగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 46 శాతం వృద్ధి చెంది 3.06 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కానీ బజాజ్ ఆటో అమ్మకాలు మాత్రం 28 శాతం క్షీణించి 2.27 లక్షల యూనిట్ల నుంచి 1.62 లక్షల యూనిట్లకు పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2013, 16:52 [IST]
English summary
Car sales has slipped for second month in succession with an 8.15 per cent drop in November, 2013 due to drying up of demand after the festive season. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+