వరుసగా 8 నెలలోను తగ్గుముఖం పట్టిన కార్ సేల్స్

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, జూన్ 2013 నెలలో కార్ల అమ్మకాలు 9 శాతం తగ్గాయి. పెరుగుతున్న యాజమాన్యపు ఖర్చు, తగ్గుతున్న ఆర్థిక వృద్ధి మరియు రూపాయి పతనంతో ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకులే ఈ తగ్గుదలకు కారణని విశ్లేషకులు భావిస్తున్నారు.
సియామ్ తెలిపిన గణాంకాల ప్రకారం గడచిన నెలలో మొత్తం 1,39,632 కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే ఈ అమ్మకాలు 9 శాతం తగ్గాయి. జూన్ 2013 నెలలో మోటార్‌సైకిళ్లు, ట్రక్కులు మరియు బస్సుల అమ్మకాలు కూడా క్షీణించాయి.
మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 9.2 శాతం క్షీణించి 7,99,139 యూనిట్లగా నమోదు కాగా, ట్రక్కులు మరియు బస్సుల అమ్మకాలు కూడా 13.5 శాతం తగ్గి 56,197 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ వెల్లడించింది. భారత ఆటోమొబైల్ మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే ఆస్కారం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








