చెవర్లే బీట్ ఇప్పుడు ప్రత్యేక ధరలో; రూ.3.39 లక్షలు
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న బుజ్జి కారు 'చెవర్లే బీట్'ను ఇప్పుడు ప్రత్యేక ధరకే అందిస్తోంది. దేశీయ విపణిలో చెవర్లే బీట్ విడుదలై మూడు విజయవంతమైన సంవత్సరాలు పూర్తి కావస్తుండటంతో, కంపెనీ ఈ మోడల్‌ను కేవలం రూ.3.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తుంది. ఈ ప్రత్యేక ధర జూన్ 20, 2013 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది.
సాధారణంగా, చెవర్లే బీట్ ప్రారంభ ధర రూ.3.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, ఈ కారు మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ మోడల్‌పై రూ.48,000 లకు పైగా తగ్గింపును అందిస్తోంది. బెస్ట్ డీల్‌లో బీట్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే చక్కటి అవకాశం. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత చెవర్లే డీలరును సంప్రదించండి.
చెవర్లే ఇండియాకు బీట్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. చెవర్లే బీట్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, పెట్రోల్ వెర్షన్ బీట్ లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీని డీజిల్ వెర్షన్ బీట్ లీటరుకు 25.44 కిలోమీటర్ల మైలేజీనిస్తాయి.
చెవర్లే బీట్ టాప్-ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు లభిస్తాయి.



Click it and Unblock the Notifications








