మే 9న చెవర్లే ఎంజాయ్ విడుదల; డీలర్ల వద్దకు డెమో కార్లు

By Ravi

Chevrolet Enjoy
భారత ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) సెగ్మెంట్లోకి మరొక సరికొత్త మోడల్ విడుదల కాబోతుంది. ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, మహీంద్రా జైలో వంటి మోడళ్లను సవాల్ చేస్తూ, అమెరికాకు చెందిన అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ తమ 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివిని ఈనెల 9న మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే చెవర్లే తమ అధీకృత డీలర్ల వద్దకు కొన్ని డెమో మోడళ్లను పంపించింది. అంతేకాకుండా, చెవర్లే ఇండియా డీలర్లు ఈ ఎమ్‌పివి కోసం బుకింగ్‌లు, టెస్ట్ డ్రైవ్ అభ్యర్థనలను కూడా స్వీకరిస్తున్నారు. చెవర్లే ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంజాయ్ ఎమ్‌పివి ఫొటోలను, ఫీచర్లను వెల్లడి చేసింది. దీని ధర మరియు మరిన్ని ఇతర వివరాలు మే 9, 2013న వెల్లడి కానున్నాయి.

చెవర్లే ఎంజాయ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 127 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2013, 15:00 [IST]
English summary
General Motors India is just a day away from the launch of its Chevrolet Enjoy MPV in India. The Chevrolet Enjoy MPV would be launched on May 9, 2013. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+