చెవర్లే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆఫర్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న చెవర్లే వాహనాలపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. వివిధ చెవర్లే కార్లపై రూ.66,000 వరకు తగ్గింపులను కంపెనీ అందిస్తోంది.
త్వరపడండి.. ఈ ఆఫర్స్ ఆగస్ట్ 15, 2013 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. స్పార్క్, బీట్ (డీజిల్, పెట్రోల్), క్రూజ్, సెయిల్ హ్యాట్‌బ్యాక్ (పెట్రోల్), సెయిల్ సెడాన్ (డీజిల్) మోడళ్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ చెవర్లే వాహనాలపై లభిస్తున్న డిస్కౌంట్స్ బ్రేకప్ క్రింది విధంగా ఉంది.

- చెవర్లే సెయిల్ యువా (పెట్రోల్) - రూ.33,000 బెనిఫిట్స్
- చెవర్లే సెయిల్ సెడాన్ (పెట్రోల్) - రూ.35,000 బెనిఫిట్స్
- చెవర్లే క్రూజ్ సెడాన్ - రూ.45,000 బెనిఫిట్స్
- చెవర్లే స్పార్క్ (పెట్రోల్) - రూ.58,000 బెనిఫిట్స్
- చెవర్లే బీట్ (డీజిల్) - రూ.60,000 బెనిఫిట్స్
- చెవర్లే బీట్ (పెట్రోల్) - రూ.66,000 బెనిఫిట్స్
ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత చెవర్లే డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








