యూ ఫస్ట్ క్యాంప్‌ను ప్రారంభించిన చెవర్లే ఇండియా
జనరల్ మోటార్స్ బ్రాండ్ చెవర్లే ఇండియా తమ వినియోగదారుల కోసం ఓ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. 'యూ ఫస్ట్ క్యాంప్' పేరుతో చెవర్లే ఇండియా అందిస్తున్న ఈ ఉచిత సర్వీస్ క్యాంప్ దేశవ్యాప్తంగా ఉన్న 250 డీలర్‌షిప్ కేంద్రాలలో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 21, 2013 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ క్యాంప్‌లో భాగంగా, చెవర్లే వాహనాల యజమానులు తమ వాహనాలను ఈ సర్వీస్ క్యాంప్‌కు తీసుకువస్తే, సర్వీస్ ఇంజనీర్లు ఉచితంగా చెకప్ చేయటం జరుగుతుందని కంపెనీ తెలిపింది.
చెవర్లే యూ ఫస్ట్ క్యాంప్‌తో పాటుగా కస్టమర్లకు కంపెనీ అందిస్తున్న వివిధ ఆఫర్లు ఇలా ఉన్నాయి:
- ఉచిత సర్వీస్ చెకప్
- లేబర్ ఛార్జీలు, విడిభాగాలపై డిస్కౌంట్స్
- టెస్ట్ డ్రైవ్స్
- బుక్ అండ్ ఎక్సేంజ్ కార్ సౌకర్యం
- రుణ సదుపాయం
- ఆకర్షనీయమైన బహుమతులు
ఈ క్యాంప్‌కు సంబంధించిన మరిన్న వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత చెవర్లే ఇండియా డీలర్‌ను సంప్రదించండి.



Click it and Unblock the Notifications








