స్పార్క్, బీట్, సెయిల్, క్రూజ్ మోడళ్లపై చెవర్లే ప్రత్యేక బోనస్
మీరు చెవర్లే బ్రాండ్ కారును ఉపయోగిస్తున్నారా..? కొత్తగా ఇంకొ చెవర్లే కారను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం చెవర్లే ఇండియా ఓ సరికొత్త ఆఫర్‌ను అందిస్తోంది. చెవర్లే వినియోగదారులకు కంపెనీ రు.10,000 లాయల్టీ బోనస్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ కేవలం చెవర్లే బ్రాండ్ వినియోగదారులకు మాత్రమే.
చెవర్లే ఇండియా ఆఫర్ చేస్తున్న ఈ రూ.10,000 లాయల్టీ బోనస్ కంపెనీ అందిస్తున్న స్పార్క్, బీట్, సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌లు మరియు క్రూజ్ సెడాన్‌పై మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో చెవర్లే ఇండియా అధీకృత డీలరును సంప్రదించండి.
ఇదిలా ఉండగా చెవర్లే ఇండియా గురువారం నాడు తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'ఎంజాయ్'ను కేవలం రూ.5.49 లక్షల ప్రారంభ ధరకే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. అయితే, ప్రస్తుతానికి ఈ మోడల్‌పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఆఫర్ చేయటం లేదు.



Click it and Unblock the Notifications








