హైదరాబాద్‌ మార్కెట్లో చెవర్లే సెయిల్ సెడాన్‌ విడుదల

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 'చెవర్లే సెయిల్' సెడాన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా లభ్యమవుతోంది. తమ కొత్త కారు చెవర్లే సెయిల్ సెడాన్‌ను కంపెనీ సోమవారం రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శాస్త్రి వెంపటి విలేఖరులతో ముచ్చటిస్తూ, సెయిల్ సెడాన్‌తో పాటు మరిన్ని కొత్త కార్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

భారత మార్కెట్లోని ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో ప్రతినెలా 40,000 లకు పైగా కార్లు అమ్ముడవుతున్నాయని, ఈ సెగ్మెంట్లో తాము తాజాగా ప్రవేశపెట్టిన సెయిల్ సెడాన్ ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేయగలమని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కారులో ఉపయోగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్లను మహరాష్ట్రలోని తాలేగావ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నామని శాస్త్రి తెలిపారు. రాష్ట్ర మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ సెయిల్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.41 లక్షల రేంజ్‌లో ఉండగా, డీజిల్ వెర్షన్ సెయిల్ ధరలు రూ.6.29 లక్షల నుంచి రూ.7.51 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో ఫియట్‌ను గ్రహించిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌‌ను అమర్చారు ఇది 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌


జిఎమ్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన సరికొత్త సెయిల్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి డిజైర్, టొయోటా ఎతియోస్, ఫోర్డ్ క్లాసిక్, మహీంద్రా వెరిటో, టాటా ఇండిగో ఈసిఎస్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. సెయిల్ సెడాన్ 370 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ కారు సస్పెన్షన్‌ను, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‍‌‌ను ట్యూన్ చేశామని కంపెనీ పేర్కొంది.

ఆకర్షనీయమైన డిజైన్, స్టయిలిష్ లుక్, ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్లతో ఇది విలాసవంతమైన కారు అనుభూతిని అందిస్తుంది. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు చెవర్లే సెయిల్ సొంతం.

More from DriveSpark

Article Published On: Wednesday, February 6, 2013, 10:22 [IST]
English summary
General Motors has launched its all-new Chevrolet Sail sedan in Hyderabad. Petrol version Chevrolet Sail sedan price starts from INR 4.99 lakhs and diesel version Chevrolet Sail sedan price starts from INR 6.29 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+