రూ.4.99 లక్షలకే చెవర్లే సెయిల్ సెడాన్‌ విడుదల

జనరల్ మోటార్స్ ఇండియా సరసమైన ధరకే తమ ఎంట్రీ లెవల్ సెడాన్ 'సెయిల్' మార్కెట్లోకి తీసుకవచ్చింది. కార్ ప్రియులను ఆశ్చర్యపరస్తూ కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే సెయిల్ సెడాన్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. చెవర్లే సెయిల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ సెయిల్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.41 లక్షల రేంజ్‌లో ఉండగా, డీజిల్ వెర్షన్ సెయిల్ ధరలు రూ.6.29 లక్షల నుంచి రూ.7.51 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

జిఎమ్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన సెయిల్ యువా (Sail U-Va) హ్యాచ్‌బ్యాక్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన సరికొత్త సెయిల్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి డిజైర్, టొయోటా ఎతియోస్, ఫోర్డ్ క్లాసిక్, మహీంద్రా వెరిటో, టాటా ఇండిగో ఈసిఎస్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. సెయిల్ సెడాన్ 370 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ కారు సస్పెన్షన్‌ను, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‍‌‌ను ట్యూన్ చేశామని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో ఫియట్‌ను గ్రహించిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌‌ను అమర్చారు ఇది 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌


ఆకర్షనీయమైన డిజైన్, స్టయిలిష్ లుక్, ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్లతో ఇది విలాసవంతమైన కారు అనుభూతిని అందిస్తుంది. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు చెవర్లే సెయిల్ సొంతం.

More from DriveSpark

Article Published On: Friday, February 1, 2013, 13:49 [IST]
English summary
General Motors has finally launched a car that can pose some serious challenges to India' best selling sedan, the Maruti Suzuki Swift DZire. The new Chevrolet Sail sedan has been launched in India with a mouth watering starting price of INR 4.99 lakhs. The Chevrolet Sail is also available in Diesel priced between INR 6.29 lakhs and 7.51 lakhs (all prices ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+