చెవర్లే తవేరా, సెయిస్ డీజిల్ మోడళ్ల ఉత్పత్తి బంద్

By Ravi

Chevrolet Tavera
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న చెవర్లే తవేరా ఎమ్‌పివి మరియు చెవర్లే సెయిల్ డీజిల్ మోడళ్లలో కొన్ని సమస్యల కారణంగా ప్రస్తుతం, వీటి ఉత్పత్తిని మరియు అమ్మకాలను కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. ఆటోఎక్స్ సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత చెవర్లే డీలర్‌షిప్ కేంద్రాలలో తవేరా బిఎస్-3 వెర్షన్ మరియు కొత్తగా విడుదల చేసిన చెవర్లే సెయిల్ సెడాన్, సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వేరియంట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాల్సిందిగా కంపెనీ సూచించింది.

అయితే, ఈ మోడళ్ల అమ్మకాలను నిలిపివేయటం వెనుక ఉన్న అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ, ఆటోఎక్స్ సమాచారం ప్రకారం, తవేరాలో కాలుష్య నిబంధనల సంబంధిత సమస్యలు మరియు సెయిల్‌లో డీజిల్ ఇంజన్ నాణ్యత సమస్యలే వీటి అమ్మకాలను నిలిపివేయటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. త్వరలోనే జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో ఈ మోడళ్లను రీకాల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఈ కార్లలో సేఫ్టీ పరమైన సమస్యలు మాత్రం లేవని జనరల్ మోటార్స్ స్పష్టం చేసినట్లు ఆటోఎక్స్ పేర్కొంది.. సెయిల్ డీజిల్ మోడళ్లలో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను చెవర్లే తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎంజాయ్ ఎమ్‍‌పివిలో కూడా ఉపయోగించారు. కానీ, ఎంజాయ్ అమ్మకాలు మాత్రం యధావిధాగానే కొనసాగుతున్నాయి. ఈ సమస్యలు సమసిపోగానే ఈ మోడళ్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 11, 2013, 20:02 [IST]
English summary
General Motors has stopped production and halted sales of Chevrolet Tavera and the Sail models in India due to certain issues that have cropped up. This rumor comes from AutoX, which claims the American automaker has directed dealerships across the country to stop selling these models with immediate effect.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+