భారత మార్కెట్‌పై కన్నేసిన గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ

By Ravi

భారత్‌లో ఇప్పటి వరకూ వివిధ రంగాల్లోకి ప్రవేశించిన దేశీయ విదేశీయ కంపెనీలకు తలనొప్పిగా మారిన చైనా కంపెనీలు ఇకపై భారత ఆటోమొబైల్ రంగంపై దృష్టి సారించనున్నాయి. చెనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ' (జిడబ్ల్యూఎమ్‌సి) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక్కడి మార్కెట్లో ప్లాంటును ఏర్పాటు చేసి, కార్యకలాపాలు ప్రారభించాలని సదరు కంపెనీ యోచిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, జిడబ్ల్యూఎమ్‌సి ఉన్నతాధికారులు ఇప్పటికే భారత ప్రభుత్వం, సియామ్ మరియు పటిష్టమైన సప్లయర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చర్చలు విజయవంతమైనట్లయితే, భారత్‌లో భాగస్వామి లేకుండా కార్యకలాపాలు ప్రారంభించనున్న మొట్టమొదటి చైనీస్ కంపెనీ గ్రేట్ వాల్ మోటార్‌గా నిలువనుంది. 2016 నాటికి భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని గ్రేట్ వాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీకు చైనాలోని బావోడింగ్, టియాంజింగ్‌లలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఇది చైనాలో కెల్లా 8వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. ఇది హావల్ ఎస్‌యూవీ, గ్రేట్ వాల్ ప్యాసింజర్ కార్లు, వింగిల్ పికప్ ట్రక్స్ తదితర వాహనాలను అందిస్తోంది. జిడబ్ల్యూఎమ్‌సికు విదేశాల్లో అసెంబ్లింగ్ కేంద్రాలున్నాయి. ఇది సుమారు 100 పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.

Great Wall Motor

More from DriveSpark

Article Published On: Wednesday, January 9, 2013, 12:24 [IST]
English summary
China’s 8th largest carmaker Great Wall Motor Company (GWMC), is mulling to foray into India market. GWMC is planing to establis a manufacturing plant in India. According to recent reports, a company delegation has already met the India meet government, SIAM and potential suppliers on the same.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+