పాత కారు, ఒక్క రూపాయి ఉంటే వెంటో మీ సొంతం!
తాజాగా విడుదైలన యూనియన్ బడ్జెట్ 2013-14లో ఆటో పరిశ్రమకు ఎలాంటి తాయిలాలు అందకపోవటంతో, మార్కెట్లో మందకొడి మొదలైంది. ఈ నేపథ్యంలో కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ స్కీమ్‌లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాపిడ్ కొంటే ఫ్యాబియా ఫ్రీ, టాటా మాంజా బైబ్యాక్ స్కీమ్, టాటా నానో క్రెడిట్ కార్డ్ స్కీమ్, నిస్సాన్ తక్కువ ఈఎమ్ స్కీమ్స్ ఇలా అనేక ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
కాగా... తాజాగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఇదే కోవలో ఓ సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. కొనుగోలుదారులు తమ పాత కారును తీసుకొచ్చి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే సరికొత్త వెంటో కారును తమతో తీసుకువెళ్లొచ్చని ఓ వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, కస్టమర్లు తమ పాత కారును ఎక్సేంజ్ చేసుకొని, అదనంగా ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తాన్ని 36 ఈఎమ్ఐలలో చెల్లించే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.
పాత కారు ఎక్సేంజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీ డౌన్‌పేమెంట్‌గా ఉంచుకొని, మిగిలిన మొత్తానికి ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో ధరలు రూ.7.2 లక్షలు మొదలుకొని రూ.9.9 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఇందుకు వర్తించే నియమ నిబంధనలను మీ సమీపంలోని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధీకృత డీలరును నుంచి తెలుసుకోవచ్చు.



Click it and Unblock the Notifications








