కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కార్ విండ్‌షీల్డ్స్ వస్తున్నాయ్..!

By Ravi

త్వరలోనే కార్ల అద్దాలు మరింత తేలికగా, పటిష్టంగా మారనున్నాయి. ప్రస్తుతం కార్లలో ఉపయోగిస్తున్న విండ్‌షీల్డ్‌ అద్దాల విషయంలో, అద్దానికి ఇరువైపులా మందపాటి ప్లాస్టిక్ పేపర్‌తో ట్యాంపర్ చేయబడిన వాటిని ఉపయోగిస్తున్నారు. దీని వలన ప్రమాదం జరిగినప్పుడు అద్దం పగిలిపోయి చిన్న చిన్ని ముక్కలుగా కావటం తగ్గుతుంది. అయితే, ఇది అన్ని సందర్భాల్లో అంత సమర్థవంతంగా పనిచేయదు.

అందుకే, ప్రస్తుతం కార్లలో ఉపయోగిస్తున్న అద్దాల స్థానంలో అధునాత గొరిల్లా గ్లాస్‌లను ఉపయోగించాలను యోచిస్తున్నారు. మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ స్క్రీన్లను ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తోనే తయారు చేస్తారు. అందుకే ఇవి క్రింద పడినా పగిలిపోకుండా ఉండి, స్క్రాచ్‌లను సైతం తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇవే అద్దాలను కార్లలను ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Corning Gorilla Glass Car Windshields Coming Soon

కార్లలో ఉపయోగించనున్న కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లు సాధారణ అద్దాల మాదిరిగా బరువుగా ఉండకుండా, తేలికగా మరియు అత్యంత ధృఢత్వాన్ని కలిగి ఉంటాయి. వీటి ఉపయోగం వలన కారు బరువు తగ్గి మైలేజ్ పెరిగేందుకు కూడా ఇవి సహకరిస్తాయి. ఇవి స్క్రాచ్‌‌లను తట్టుకుంటాయి కాబట్టి ఎక్కువ కాలం మన్నుతాయి. అంతేకాకుండా, కారు వెలుపలి శబ్ధాలను కారు లోపలకి ప్రవేశింపజేయకుండా ఉండటంలో కూడా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫలితంగా కారు లోపల క్యాబిన్ మరింత ప్రశాంతంగా ఉంటుంది.

ఇన్ని సదుపాయాలను కలిగిన గొరిల్లా గ్లాస్‌లను ఆటోమొబైల్ కంపెనీలు ఉపయోగించకపోవటానికి కారణం ఒక్కటే, అదే వీటి ధర. ధరలో ఇవి సాధారణ గ్లాస్ కన్నా కాస్తంత అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని కొనుగోలు చేసేందుకు ఆటోమొబైల్ కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. మరి నాణ్యత కావాలంటే కాస్తం పైకం వెచ్చించాల్సిందేగా.. మీరేమంటారు?

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2013, 13:08 [IST]
English summary
Gorilla Glass is an extremely durable, highly scratch resistant glass that is also extremely light. During an interview at MIT Technology Review's recently held mobile Summit 2013 in San Francisco Corning Senior Vice President Jeffrey Evenson spoke about the benefits of Gorilla Glass to the automobile sector.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+