రెనో డస్టర్‌ను కస్టమైజ్ చేసిన డిసి డిజైన్స్

By Ravi

వివిధ రకాల వాహనాలను అద్భుతమైన రీతిలో కస్టమైజ్ చేయటంలో డిసి డిజైన్స్‌‌కు పెట్టింది. ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా స్థాపించిన ఈ డిసి డిజైన్స్ సంస్థ ఇప్పటికే టాటా ఆరియా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా వింగర్, హిందుస్థాన్ అంబాసిడర్, అశోక్ లేలాండ్ బస్ వంటి అనేక వాహనాలను కస్టమైజ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా డిసి డిజైన్స్ నుంచి రానున్న సరికొత్త కస్టమైజ్డ్ వెహికల్ 'డిసి డస్టర్'.

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా నుంచి భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న రెనో డస్టర్ ఎస్‌యూవీ డిసి డిజైన్స్ తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది. త్వరలోనే ఈ డిసి డస్టర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఫొటోలను ఈ సంస్థ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే, డిసి డిజైన్స్ తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో డిసి డస్టర్ టీజర్‌ను విడుదల చేసింది. (క్రింది ఫొటోలో చూడొచ్చు).

DC Duster From DC Designs

ఈ టీజర్ ఫొటోను గమనిస్తే, రెనో డస్టర్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి సరికొత్త గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్స్, హెడ్‌లైట్స్ స్థానంలో శక్తివంతమైన ఎల్‌ఈడి ల్యాంప్స్‌తో ఇది మరింత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రోమ్ కోటింగ్ వలన ఇది మరింత ఆకర్షనీయమైన లుక్‌ని కలిగి ఉంటుంది. బానెట్ డిజైన్‌ను కూడా మార్పు చేశారు.

ఈ డిసి డస్టర్ ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే, డిసి డిజైన్స్ తమ డిసి డస్టర్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలను విడుదల చేసే వరకూ వేచి ఉండాల్సిందే మరి. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2013, 16:08 [IST]
English summary
DC Designs has modified Renault India's most popular Compact SUV Duster. DC has teased the front fascia of the car and has said 'Coming Soon'. Stay tuned for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+