కమింగ్ సూన్: 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ350 సిడిఐ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

By Ravi

మా డ్రైవ్‌స్పార్క్ బృందం తాజాగా మరో మెర్సిడెస్ బెంజ్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. జర్మనీనికి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ 2013 ఈ-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను మహారాష్ట్రలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేస్తోంది.

టెస్ట్ డ్రైవ్ పూర్తయిన తక్షణమే ఈ కారుకు సంబంధించిన పూర్తి సమీక్షను ప్రచురించడం జరుగుతుంది. ఈలోపుగా కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ లగ్జరీ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి..!

కొత్త 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ యాక్టివ్ పార్క్ అసిస్ట్, ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్, ఈకో స్టార్ట్-స్టాప్, అటెన్షన్ అసిస్ట్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)తో కూడిన బ్రేక్ అసిస్ట్, ప్రీ సేఫ్ మరియు యాక్టివ్ బానెట్ వంటి సురక్షితమైన ఫీచర్లను అలాగే కొత్త పానరోమిక్ సన్‌రూఫ్, నాపా లెథర్ అప్‌హోలెస్ట్రీ, 3 యాంబీంట్ లైటింగ్ ఎఫెక్ట్స్, డ్యాష్‌బోర్డుపై ఓపెన్ పోర్ యాష్ ఉడ్ ఇంటీరియర్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లను ఇందులో జోడించారు.

Mercedes Benz E350 CDI Test Drive

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ200 సిజిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ250 సిడిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.1 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 80 లీటర్లు. పెట్రోల్ వేరియంట్ 13.75 కెఎమ్‌పిల్ మైలేజీని, డీజిల్ వేరియంట్ 17.25 కెఎమ్‌పిల్ మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. రాష్ట్ర మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
  • మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ200 సిజిఐ - రూ.42.23 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ250 సిడిఐ - రూ.45.27 లక్షలు
  • ఈ250 సిడిఐ లాంచ్ ఎడిషన్ (100 యూనిట్లు మాత్రమే) - రూ.50.78 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Friday, December 27, 2013, 17:20 [IST]
English summary
DriveSpark team now test driving the new 2013 Mercedes Benz E-Class luxury saloon. Stay tuned to drivespark.com for full review of this car. German luxury carmaker Mercedes-Benz has launched new 2013 E-Class launched with the starting price of Rs. 42.23 lakh (Ex-Showroom, Delhi) for the petrol version.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+