నిస్సాన్ ఇండియా నుంచి స్పెషల్ ఎడిషన్ సన్నీ

నిస్సాన్ ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సన్నీలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో (పెట్రోల్, డీజిల్) మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నిస్సాన్ సన్నీ సెడాన్‌కు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి, మరిన్ని సరికొత్త ఫీచర్లను జోడించి ఓ స్పెషల్ ఎడిషన్‌ను నిస్సాన్ సన్నీని కంపెనీ అందిస్తోంది. ఫిబ్రవరి 12 నాటికి ఈ స్పెషల్ ఎడిషన్ సన్నీ సెడాన్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

వెనుక వైపు డోర్‌పై క్రోమ్ కోటింగ్, రియర్ రూఫ్ స్పాయిలర్, రియర్ పార్కింగ్ కెమెరా, ప్రీమియం లెథర్ సీట్స్, మరియు బ్లూటూత్, ఆక్స్-ఇన్, డివిడి, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మల్టీమీడియా టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లను ఈ సరికొత్త స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీలో గమనించవచ్చు. అయితే, ఇందులో యాంత్రిక పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. సాధారణ వేరియంట్లలో ఉపయోగించిన పెట్రోల్, డీజిల్ ఇంజన్లలనే ఈ స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీలోను ఉపయోగించనున్నారు.

దేశీయ విపణిలో నిస్సాన్ సన్నీ స్పెషల్ ఎడిషన్ ధరలు ఇలా ఉన్నాయి:

  • స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.8.60 లక్షలు
  • స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి (డీజిల్) - రూ.9.68 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, థానే)

Nissan Sunny Special Edition

More from DriveSpark

Article Published On: Tuesday, February 5, 2013, 15:15 [IST]
English summary
Nissan India is alls set to launch a special edition of its flagship mid-size sedan Nissan Sunny. The special edition Sunny will boost cosmetic changes and will add some additional feature. The special edition Sunny will hit showrooms pan-India February 12.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+