నిస్సాన్ చీప్ బ్రాండ్ 'డ్యాట్సన్' పయనం భారత్ నుంచి మొదలు
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్, తమ పురాతన కార్ బ్రాండ్ 'డ్యాట్సన్'ను తిరిగి మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. నిస్సాన్ 32 ఏళ్ల తర్వాత పునఛప్రవేశపెట్టనున్న ఈ 'డ్యాట్సన్' బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్‌ను ఇండియా నుంచే మొదలుపెట్టనుంది. డ్యాట్సన్ బ్రాండ్ క్రింద నిస్సాన్ తక్కువ ధర కలిగిన కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇండియా, రష్యా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లను లక్ష్యాంగా చేసుకొని డ్యాట్సన్ కార్లు రానున్నాయి.
కొత్త డ్యాట్సన్ నేమ్‌ప్లేట్ వరల్డ్ ప్రీమియర్‌ను జులై 15న న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ వద్ద నిర్వహించనున్నారు. రూ.4 లక్షల ధరకు దిగువన, 5 డోర్లతో రూపొందించిన తొలి డ్యాట్సన్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను రెనో-నిస్సాన్ గ్లోబల్ సీఈఓ కార్లోస్ ఘోస్న్ ఆవిష్కరించవచ్చని సమాచారం. ఎక్కువ డిమాండ్ ఉండే బడ్జెట్ కార్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసుకొని నిస్సాన్ ఈ డ్యాట్సన్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టనుంది. భారత్‌లో ఏటా 1,50,000 యూనిట్ల నుంచి 2,00,000 యూనిట్ల డ్యాట్సన్ కార్లను విక్రయించవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.
కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల అభిలాష మరియు సరమైన ధరలతో డ్యాట్సన్ బ్రాండ్ భారత్‌లో మంచి సక్సెస్‌ను సాధించగలదని నిస్సాన్ ధీమా వ్యక్తం చేస్తుంది. కొత్త డ్యాట్సన్ నేమ్‌ప్లేట్ వరల్డ్ ప్రీమియర్‌కు సంబంధించి కంపెనీ ఓ టీడర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌ను బట్టి గమనిస్తే, కొత్త డ్యాట్సన్ బ్రాండ్ సరికొత్త స్టయిలింగ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే జులై 15 వరకూ ఆగాల్సిందే మరి.



Click it and Unblock the Notifications








