డిసి డిజైన్ 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ప్లాన్స్ వెల్లడి

By Ravi

గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 'డిసి అవంతి' మేడ్ ఇన్ ఇండియా చీపెస్ట్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న ప్రముఖ ఆటోమోటివ్ కస్టమైజేషన్ సంస్థ 'డిసి డిజైన్' వచ్చే ఏడాది జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పో కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. డిసి అవంతి మాదిరిగానే ఈసారి రెండు సరికొత్త మోడళ్లను ప్రదర్శిస్తామని ఈ సంస్థ పేర్కొంది.

ప్రముఖ ఆటోమోటివ్ కస్టమైజర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్ సంస్థ, ఫిబ్రవరి 2014లో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న రెండు మోడళ్లలో ఒకటి కన్వర్టిబల్ ఎస్‌యూవీ కాగా మరొకటి చిన్న కారు ఉంటుందని ఛాబ్రియా తెలిపారు. కన్వర్టిబల్ ఎస్‌యూవీలో నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చని అలాగనే తాము ప్రదర్శించనున్న చిన్న కారు టాటా నానో కన్నా చిన్నదిగా ఉండి, ఇద్దరు ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

అయితే, డిసి కార్లు మాత్రం చవకగా ఉంటాయని అంచనా వేయాల్సిన అవసరం లేదు. విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉండే ఈ రెండు కార్ల ధరలు సుమారు రూ.18 లక్షల నుంచి రూ.40 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. అలాగే, డిసి డిజైన్ నుంచి రానున్న ఈ రెండు మోడళ్లు ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరో రెండేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

DC Avanti

ఇదిలా ఉండగా.. డిసి డిజైన్ గతంలో ఆవిష్కరించిన డిసి అవంతి స్పోర్ట్స్ కారును కూడా వచ్చే ఫిబ్రవరిలో కస్టమర్లకు డెలివరీ చేయనుంది. మొత్తం 25 కార్లను తొలిసారిగా కస్టమర్లకు అందించనున్నారు. డిసి అవంతి కారులో 2.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 240 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

వచ్చే జూన్ 2014 నుంచి డిసి డిజైన్ పూనేలో ఉన్న తాలేగావ్ ప్లాంటులో పూర్తిస్థాయిలో అవంతి స్పోర్ట్స్ కారును ఉత్పత్తి చేయనుంది. డిసి డిజైన్‌కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి. డిసి అవంతి ధర రూ.25 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, December 30, 2013, 16:05 [IST]
English summary
Automobile customiser DC Design is in a phase of transformation when its trying to establish itself as luxury car manufacturer that will cater to a niche crowd. As part of this transformation, the Dilip Chhabria run car customization house will showcase two new models at the upcoming Indian Auto Expo 2014 in Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+