2013 పార్క్స్ సూపర్‌కార్ షోను గెలిచిన డిసి లాంబోర్గినీ అవెంటేడర్
వాహనాలను మోడిఫై చేయటంలో దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ మంచి పాపులరాటీని సంపాధించుకుంది. డిజి డిజైన్స్ మోడిఫై చేసే వాహనాలకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ప్రజల కారు టాటా నానో మొదలుకొని ఖరీదైనా లాంబోర్గినీ వరకూ దాదాపు అన్ని రకాల కార్లను డిసి డిజైన్స్ మోడిఫై చేస్తుంది. ఇదిగో తాజాగా డిసి డిజైన్స్ మోడిఫై చేసిన ఈ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారును చూడండి.
స్పెషల్ ప్రిస్మ్ గోల్డ్ పెయింట్, బ్లాక్ రూఫ్ (కారు పైభాగం), బ్లాక్ సైడ్ వ్యూ మిర్రర్ర్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బెస్పోక్ ఇంటీరియర్స్ వంటి పలు ఫీచర్లతో డిసి డిజైన్స్ ఈ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారును మోడిఫై చేసింది. ఇటీవలే ముంబైలో జరిగిన 2013 పార్క్స్ సూపర్‌కార్ షోలో ఈ సూపర్‌కారు విజేతగా నిలిచింది. ఈ షోలో దాదాపు 100కు పైగా సూపర్‌కార్ కార్లు పాల్గొనగా ఈ గోల్డ్ కలర్ లాంబోర్గినీ అవెంటేడర్ విజేతగా నిలవటం విశేషం.
డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఈ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారు ముందువైపు విజే (VJ) అనే అక్షరాలు ఉన్నాయి. దీన్ని బట్టి, ఈ సూపర్‌కారు విజయ మాల్యాకు చెందినదనే పుకార్లు కూడా వస్తున్నాయి. విజయ మాల్యా తమ ఫార్ములా వన్ రేస్ కారును కూడా విజెఎమ్ అనే పేరును పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో డిసి లాంబోర్గినీ అవెంటేడర్ కూడా విజయ మాల్యాకు చెంది ఉండచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
పైపెచ్చు విజయ మాల్యా గోల్డ్ కలర్ కార్లంటే మహా ఇష్టం. మొన్నా ఆ మధ్య ఎప్పుడో తమ గోల్డ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును క్రికెట్ స్టేడియంలో పార్క్ చేసి ఉంటే, ఎవడో తుంటరి వెధవ ఆ పదునైన వస్తువు ఏదో తీసుకొని ఆ కారుపై గీతలు పెట్టడం, అప్పటి అది హాట్ కావటం కూడా మనకు తెలిసినదే. ఇవన్నీ చూస్తే ఈ కారు అయనకు సంబంధించి ఉంటుందని సదరు సూపర్‌కార్ షోకు విచ్చేసిన వాళ్లంతా అనుకున్నారు. మరి ఈ గోల్డ్ కలర్ లాంబర్గినీ అవెంటేడర్‌పై ఓ కన్నేస్కోండి..!

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్



Click it and Unblock the Notifications








