లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.45 నష్టం: ఆయిల్ కంపెనీలు
ఈ ఏడాది జనవరి నెల నుంచి డీజిల్ ధరల నియంత్రణను ప్రభుత్వం తెలివిగా చమురు సంస్థలకు అప్పగించడంతో వారు ప్రతినెలా ఎంతో కొంత ధరను పెంచేస్తూ, ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసినదే. అయితే, తాజాగా మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో, చమురు కంపెనీలు మరియు ప్రభుత్వంపై ఈ భారం ఇప్పటికీ అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో, డీజిల్ నష్టాలు కూడా భారీగానే పెరుగుతున్నాయని చమురు కంపెనీలు వాపోతున్నాయి. డీజిల్ ఇంధనాన్ని సబ్సిడి ధరకే విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.45 మేర నష్టం వాటిళ్లుతోందని సదరు కంపెనీలు చెబుతున్నాయి.
దేశపు అదిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపిన సమాచారం ప్రకారం, గడచిన 15 రోజుల క్రితం వరకు లీటరు డీజిల్ విక్రయంపై రూ.8.60 నష్టం ఉండేదని, ఇది రూ.9.45కి చేరిందని ఆ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) పి.కె గోయెల్ తెలిపారు.

జనవరి 2013లో కేంద్ర సర్కారు డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేసి, ప్రతినెల లీటరుకు 40-50 పైసల చొప్పును పెంచుకుని నష్టాలను భర్తీ చేసుకోండని చమురు కంపెనీలకు సూచిందిం. ఈ నేపథ్యంలో, వరుసుగా డీజిల్ ధరలు పెంచిన చమురు కంపెనీలు గడచిన మార్చ్ నెలాఖరు నాటికి డీజిల్‌పై రూ.8.64గా ఉన్న నష్టాన్ని రూ.2.62 లకు తగ్గించుకున్నాయి.
కానీ, ఇటీవలి కాలంలో డాలర్ మారకంతో రూపాయి భారీగా పతనం కావడంతో డీజిల్ నష్టాలు తిరిగి రూ.9.45కు పెరిగాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే డీజిల్ చమురు కంపెనీలు ప్రతినెలా డీజిల్ వడ్డింపును చేయటం ఖాయం. మరికొద్ది రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు ఒకేస్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








