లీటరుకు రూ.10 చొప్పున పెరగనున్న డీజిల్ ధరలు

By Ravi

Diesel Price Hike
త్వరలోనే డీజిల్ ధరలు భగ్గమనున్నాయి. డీజిల్ ధరను భారీగా పెంచి, తమపై పడుతున్న భారాన్ని ప్రజలపై మోపి చేతులు దులుపుకోవాలని సర్కారు సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వం ప్రస్తుతం సబ్సిడి ధరకే విక్రయిస్తున్న డీజిల్‌పై మెల్లిగా సబ్సిడిని ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే, దఫాల వారీగా డీజిల్ ధరను రానున్న 10 నెలల్లో రూ.10 మేర పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో విడతల వారీగా పెంపు ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా బలంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

చమురు కంపెనీలు వంట గ్యాస్, డీజిల్, కిరోసిసన్‌లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో గడచిన సంవత్సరంలో సుమారు 1,67,000 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లనట్లు అంచనా. ఈ భారమంతా ప్రభుత్వం పైనే పడుతోంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో, పెట్రో మంట నుంచి తప్పించుకునేందుకు గాను, ఆ మంటకే ప్రజలను ఆహుతి చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. తమకు వేరొక మార్గం లేదని, ధరలు పెంచక తప్పదని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించనుందని, ఇందులో భాగంగా రానున్న పది నెలల్లో ప్రతి లీటరు డీజిల్‌పై నెలకు ఒక్క రూపాయి చొప్పును పెంపు విధించనున్నామని ఆయన తెలిపారు. గడచిన సెప్టెంబర్ నెలలో డీజిల్ ధరలను ఒక్కసారిగా ప్రతి లీటరుపై రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.47.15 లుగా ఉంది. ఈ ధరకు విక్రయిస్తున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.28 నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 4, 2013, 12:39 [IST]
English summary
Diesel prices likely to go up by Rs 10 per litre in the next 10 months. “We are left with no choices, There is a need to raise prices. The government is contemplating raising diesel prices by Rs 1 per litre each month for next 10 months to bring retail rates at par with their cost,” said a senior official in the oil ministry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+