డీజిల్ ధర పెంపు మాపై ప్రభావం చూపదు: మారుతి సుజుకి

మెల్లిగా మెల్లిగా డీజిల్ ధరలను పెంచడం ద్వారా తమపై పడుతున్న సబ్సిడీ భారాన్ని తప్పించుకుని, వీటి ధరలు స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, డీజిల్‌ ధరలపై పాక్షిక నియంత్రణ ఎత్తివేసినప్పటికీ, అది భారత ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపబోదని దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) పేర్కొంది.

అలాగే, ఈ పెంపు తమ సంస్థపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపబోదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్‌ ఆర్‌సి భార్గవ వ్యాఖ్యానించారు. లీటర్‌ డీజిల్‌పై మరో రూ.6 ధర పెరిగినా, పెట్రోల్‌ ధరతో రూ.11 అంతరాయం ఉంటుందని ఆయన చెప్పారు. వాస్తవానికి డీజిల్ ధర పెరిగితే, డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గముఖం పడుతాయి. మారుతి సుజుకి ప్రధానంగా పెట్రోల్ కార్లను తయారు చేస్తుంది. ఈ సంస్థకు డీజిల్ కార్ల పోర్ట్‌ఫోలియో కన్నా పెట్రోల్ కార్ల పోర్ట్‌ఫోలియోనే ఎక్కువ.

ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న డీజిల్ కార్ల వెయిటింగ్ పీరియడ్‌తో పోల్చుకుంటే పెట్రోల్ కార్ల వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువగా ఉంది. డీజిల్ ధర పెంపు వలన డీజిల్‌ కార్ల విక్రయాలు తగ్గిపోతాయని, అయితే తమ సంస్థ డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్‌ వినియోగ కార్లు ఉత్పత్తి చేయడం లేదని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తే డీజిల్ కార్ల ఉత్పత్తి తగ్గిస్తామని భార్గవ చెప్పారు. గడచిన సంవత్సరం మార్కెట్ ట్రెండ్ ప్రకారం, పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది మార్కెట్ పరిణామాలను గమనిస్తుంటే, డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్లే ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Maruti Suzuki

More from DriveSpark

Article Published On: Wednesday, January 23, 2013, 6:39 [IST]
English summary
The Indian government has allowed oil companies to increase diesel prices in small quantities in the coming months. While many are expecting the diesel price hike would act as a speed bump to the already slowing car industry, Maruti Suzuki chairman RC Bhargava has stated that there will be a minimal impact on diesel car sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+