పెరిగిన డీజిల్ ధర; లీటరు 50 పైసల పెంపు

Diesel
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే చమురు కంపెనీ మరోసారి డీజిల్ ధరను పెంచాయి. ఈసారి లీటరుకు 50 పైసల చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా.. గడచిన జూన్ నెల ఆరంభంలో డీజిల్ ధరను 50 పైసలు పెంచిన సంగతి తెలిసినదే.

ఈ ఏడాది జనవరి నెల నుంచి గమనిస్తే, దాదాపుగా ప్రతినెలా డీజిల్ బాదుడు కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఒక్కసారిగా కాకుండా, దఫాల వారీగా ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికను చమురు సంస్థలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి నెలా డీజిల్ ధరను స్వల్పంగా పెంచుతూ వస్తున్నాయి.

పరిశ్రమ వర్గాల సమాచారం ఈ ఏడాది చివరి వరకూ ఇలా డీజిల్ ధరను ప్రతినెలా కాస్తంత పెంచుతూ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా చేయటం వలన డీజిల్ ధరపై ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే ఆస్కారం ఉంది. ఇదే కొనసాగితే, కొద్ది రోజులకు డీజిల్, పెట్రోల్ ఇంధన ధరల్లో పెద్ద తేడా ఉండకపోవచ్చు.

ఇదిలా ఉండగా, జూన్ నెలాఖరులో చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుపై రూ.1.82 పైసల మేర (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచిన సంగతి తెలిసినదే. ఒక్క నెల రోజుల వ్యవధిలో వరుసగా పెట్రోల్ ధరను పెంచడం ఇది మూడవసారి. స్థానిక పన్నులు కలుపుకుంటే హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.38 పైసల మేర పెరిగింది. ఇదివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.72.46గా ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.74.84కు పెరిగింది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2013, 11:22 [IST]
English summary
As we reported earlier, Diesel prices have been hiked by 50 paisa per litre, excluding VAT, with effect from Monday midnight. This is the fifth increase in diesel rates in 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+