లీటరుకు 90 పైసల చొప్పును పెరిగిన డీజిల్ ధర

రిటైల్ ధరకు పన్నులు కలుపుకుంటే ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.48.67 నుంచి రూ.49.69లకు పెరింగి. అలాగే, కోల్‌కతాలో రూ.53.97, చెన్నయ్‌లో రూ.52.92 లకు పెరిగింది. డీజిల్‌ను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు అమ్మడం ద్వారా చమురు కంపెనీలు నష్టపోవడం కొనసాగినంతవరకు ప్రతి నెలా లీటర్‌కు 45 నుంచి 50 పైసల మేరకు డీజిల్ ధరను పెంచుకోవచ్చని కేంద్రప్రభుత్వం గత జనవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చమురు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా డీజిల్ ధరను పెంచేస్తున్నాయి.
గడచిన జనవరి నుంచి ఇలా డీజిల్ ధరలు పెరగటం ఇది నాల్గవసారి. మార్చి 2013లో కూడా లీటర్‌కు 45 పైసల వరకు డీజిల్ ధరను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏప్రిల్ మరియు మే నెలలకు కలిపి ఒకేసారి డీజిల్ ధరను 90 పైసలకు పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








