స్వల్పంగా పెరిగిన డీజిల్ ధర; లీటరుపై 45 పైసల పెంపు

By Ravi

Diesel
డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రతి లీటరుపై 45 పైసల చొప్పును పెంపును విధిస్తున్నట్లు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు శనివారం (మార్చి 23, 2013) నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ సంవత్సరంలో వరుసగా ఇలా డీజిల్ ధరలు పెరగటం ఇది మూడవసారి. డీజిల్ ధరలకు పాక్షికంగా స్వేచ్ఛ కల్పించేందుకే ప్రభుత్వం ప్రతినెలా దీని ధరను స్వల్పంగా పెంచుతూ వస్తోంది.

ఇలా స్వల్పంగా ధరను పెంచుతూ ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రూ.9 మేర పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానిక పన్నులు కలుపుకుంటే, ఢిల్లీలో డీజిల్ ధర 51 పైసలు, ముంబైలో 57 పైసలు, కలకత్తాలో 53 పైసలు, చెన్నైలో 55 పైసల చొప్పును పెరుగుతుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఫిబ్రవరి 16న డీజిల్ ధరలను సవరించిన సంగతి తెలిసినదే.

కాగా.. ఈనెల 16న చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరు పెట్రోల్‌పై రూ.2 చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) తగ్గించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ సమయంలో డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొద్దిగా కొద్దిగా డీజిల్ ధరను పెంచడం ద్వారా తమపై పడుతున్న సబ్సిడీ భారం నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే, ఒకేసారి రూ.9 పెంచి అందరికీ తెలిసేలా పెద్ద వాత పెట్టే బదులు కొద్దిగా కొద్దిగా పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2013, 13:18 [IST]
English summary
Diesel prices have been hiked by 45 paisa wef Saturday, 23rd March 2013, the third ever hike since January 2013, when the diesel prices were decided to be partially freed and was decided to hike prices of diesel by 45 - 50 paisa every month by a total of Rs 9.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+