బెంగుళూరులో దిలీప్ ఛాబ్రియా డిజైన్ స్టూడియో ప్రారంభం
ప్రపంచం వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆటోమొబైల్ డిజైన్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్ సంస్థ దేశ ఐటి రాజధాని బెంగుళూరులో ఓ అధునాతన కార్ డిజైన్ స్టూడియోని ప్రారంభించింది. ఎమ్వీ డ్రీమ్జ్‌డ్రైవ్ సంస్థతో డిసి డిజైన్స్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ స్టూడియోను ప్రారభించినట్లు తెలుస్తోంది. ఈ డిజైన్ స్టూడియోలో దిలీప్ ఛాబ్రియా రూపొందిన కస్టమైజ్ మోడళ్లను ప్రజర్శనకు ఉంచనున్నారు.
ఈ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా దిలీప్ ఛాబ్రియా మాట్లాడుతూ.. గార్డెన్ సిటీ బెంగుళూరులో డిజైన్ స్టూడియోను ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ప్రీమియం కార్లకు డిమాండ్ అధికంగా ఉందని, భావితరపు ఆటో డిజైనర్లకు శిక్షణ కల్పించేందుకు నగరంలో ఓ డిజైన్ స్కూల్‌ను కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఆటోమోటివ్ డిజైన్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న డిసి డిజైన్స్ తాజాగా బెంగుళూరులో ప్రారంభించిన స్టూడియోలో వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానున్న మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కార్ డిసి అవంతి, కస్టమైజ్డ్ రెనో డస్టర్ మరియు హ్యుందాయ్ ఐ20 మోడళ్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తమ కళాత్మకత మరియు నైపుణ్యాలతో విశిష్టమైన ఉత్పత్తులను రూపొందిస్తామని, ప్రతి నెలా సగటున 40 కార్లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇతర నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని దిలీప్ తెలిపారు.



Click it and Unblock the Notifications








