APSRTC 'ఫ్యామిలీ ఫోటో' చిట్కా హిట్, తగ్గిన రోడ్డు ప్రమాదాలు

By Ravi

Driving
గడచిన ఆరు నెలలుగా గమనిస్తే, ఏపిఎస్ఆర్‌టిసి బస్సు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 23,000 లకు పైగా ప్రజా రవాణా బస్సులను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు ఇప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవరిస్తున్నారు. గతంలో ఏపిఎస్ఆర్‌టిసి బస్సు నడిపే డ్రైవర్లు, బస్సు డ్యాష్‌బోర్డుపై తమ భార్యా పిల్లలో ఫోటో పెట్టుకొని నడపాలన నిబంధను తీసుకురావటంతో ప్రమాదాల సంఖ్య తగ్గాయి. దీనికితోడు అప్పుడప్పుడూ అకస్మాత్తుగా నిర్వహిస్తున్న బ్రీత్ అనలైజర్ టెస్టుల (డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్) వలన కూడా ఈ ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసును దృష్టిలో ఉంచుకొని ఏపిఎస్ఆర్‌టిసి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ) మహిళల కోసం తమ బస్సు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసింది. ఇందులో భాగంగా, మహిళా ప్యాసింజర్లపై అఘాయిత్యానికి పాల్పడే వారిని అడ్డుకుని ప్రయాణికులను రక్షణ కల్పించేందుకు గాను 7000 మందికి పైగా మహిళా కండక్టర్లకు మార్షన్ ఆర్ట్స్‌లో శిక్షణ కల్పిస్తోంది. ఏటా కనీసం 1.4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే ఏపిఎస్ఆర్‌టిసి, ప్రమాదాల నివారణలో పాటించిన ఉత్తమ విధానాలకు గాను సోమవారం నాడు రహదారుల మంత్రి సిపి జోషి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది.

గడచిన రెండేళ్లలో ఏపిఎస్ఆర్‌టిసి వరుసగా ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.13, 0.11 యాక్సిడెంట్లను మాత్రమే నమోదు చేసుకుంది. గతంలో ఇదివరకెన్నడూ లేని విధంగా, ప్రమాదాలను తగ్గించేందుకు తాము ఇటీవలే ప్రారంభించిన ఈ రెండు ప్రణాళిక వలన ప్రమాదాల సంఖ్య 0.09కు తగ్గిందని ఏపిఎస్ఆర్‌టిసి వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకె ఖాన్ తెలిపారు. డ్రైవర్లు బస్సు నడుపుతుండగా, డ్యాష్ బోర్డు‌పై తమ భార్యా పిల్లల ఫోటోలు ఉంచాలన్న నిబంధనను గడచిన సంవత్సరం జులై నెలలో అమల్లోకి తీసువచ్చారు.

ప్రతి డ్రైవర్ కూడా తాను సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తానని చెప్పి, ఇంటి నుంచి బయలుదేరుతాడని, ఇలా బస్సులో తమ ముందు భార్యా పిల్లల ఫోటో ఉండటం వలన, డ్రైవర్లు వారి కోసమైనా సురక్షితంగా ఇల్లు చేరాలనే మానసిక ఆలోచన వారిని బాధ్యతాయుతంగా డ్రైవ్ చేసేలా చేస్తుందని, ఈ నిబంధనను డ్రైవర్లు చక్కగా పాటించారని ఖాన్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 8, 2013, 17:27 [IST]
English summary
Safety in APSRTC buses has increased considerably after an innovative initiative. The photos of the wife and children of the drivers have been pasted on to the dashboards of the buses making them drive with more care.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+