దుబాయ్ పోలీస్ కార్ల జాబితాలోకి మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి
దుబాయ్ పోలీసుల లగ్జరీ, సూపర్ కార్ కలెక్షన్‌లో తాజాగా మరో బ్రిటన్ సూపర్ కారు వచ్చి చేరింది. దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ, బెంట్లీ, లాంబోర్గినీ, బుగాటి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ లగ్జరీ కార్లను, సూపర్ కార్లను కలిగి ఉన్న దుబాయ్ పోలీసులు తాజాగా తమ కలెక్షన్‌లోకి మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి కారును చేర్చుకున్నారు.
ఇది కూడా చదవండి: మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ అందిస్తున్న ఈ సూపర్‌కారులో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో 616 హెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 3.8 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 328 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి స్పైడర్ సూపర్‌కారు ధర 2,68,250 డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.1.4 కోట్లకు పైమాటే. మరి దుబాయ్ పోలీసులు నడిపే ఈ పవర్‌ఫుల్ కారు మీకు కూడా నచ్చిందా..? క్రింది వీడియోలో ఈ కారు పనితీరును వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KJmmMR2jLK8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








