ఈకోస్పోర్ట్ ఎఫెక్ట్: ఫోర్డ్ ఇండియా రికార్డ్ బ్రేకింగ్ సేల్స్

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. డిజైన్ దశ నుంచే ఈకోస్పోర్ట్ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ మోడల్ భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా కంపెనీ తలరాతనే మార్చేసింది. విడుదల కొద్దిరోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఇప్పటికీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను సొంతం చేసుకోవటానికి కొనుగోలుదారులు 7-9 నెలల వరకూ వేచిస్తున్నారంటే ఈకోస్పోర్ట్‌కు ఉన్న క్రేజ్ ఎంటో ఇట్టే అర్థమైపోతుంది.

ఈకోస్పోర్ట్ రాకతో ఫోర్డ్ ఇండియా అమ్మకాలు ఒక్కసారి జోరందుకున్నాయి. ఓవైపు దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు రుణాత్మక వృద్ధిని నమోదు చేస్తుంటే, ఈకోస్పోర్ట్ వలన ఫోర్డ్ ఇండియా మాత్రం ధనాత్మక వృద్ధిని కనబరుస్తోంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదలైన మొదటి 17 రోజుల్లోనే 30,000 బుకింగ్‌లను సొంతం చేసుకున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసినదే.

Ford Ecosport

కాగా.. గడచిన జనవరి నెలలో ఫోర్డ్ ఇండియా మొత్తం దేశీయ అమ్మకాలు 12,338 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది ఫోర్డ్ ఇండియా చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలు కావటం విశేషం. గడచిన సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే ఇది 48 శాతం వృద్ధిని సాధించింది. జులై 2012తో పోల్చుకుంటే ఫోర్డ్ ఇండియా దేశీయ అమ్మకాలు 26 శాతం పెరిగి 7,867 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు ఏకంగా 114 శాతం వృద్ధిని సాధించి 2,087 యూనిట్ల నుంచి 4,471 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2013, 18:01 [IST]
English summary
Ford India sold 12,338 domestic wholesales and export units in July, the highest-ever monthly sales in its history. This is a surge of 48 percent year-on-year. Ford India sold 7,867 wholesale units domestically, a 26 percent increase compared to July 2012. The all-new Ford EcoSport received 30,000 bookings in the first 17 days after its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+