ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 టాటా నానో వస్తోంది
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానో మరొక సరికొత్త వెర్షన్ మార్కెట్లో విడుదల కానుంది. గడచిన సంవత్సరం 2012 వెర్షన్ పేరుతో టాటా నానోలో ఓ అప్‌గ్రేడెడ్ మోడల్‌ను కంపెనీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే, ఈ సంవత్సరం కూడా టాటా నానోలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టాటా మోటార్స్ పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం ఈ అప్‌గ్రేడెడ్ టాటా నానో కారును పూనే రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.
కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ టాటా నానో ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. మా సన్నిహిత ఆటో బ్రాగ్ ఇండియన్ కార్స్ బైక్స్ ఈ నానో రహస్య చిత్రాలను తమ కెమెరాలో బంధించింది. ఫేస్‌లిఫ్ట్ 2013 టాటా నానో స్పైషాట్స్ (రహస్య చిత్రాల)ను బట్టి గమనిస్తే, టాటా నానోకు ప్రీమియం లుక్ కల్పించేందుకు వెనుక వైపు డోరు అంచుకు క్రోమ్ బార్‌ను అమర్చారు. అంతేకాకుండా, వెనుక బంపర్‌కు పైభాగంలో హనీ కోంబ్ గ్రిల్‌ను కూడా ఈ ఫోటోలలో గమనించవచ్చు.
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డుకు కుడి, ఎడమ వైపుల గ్లౌవ్ బాక్సును జతచేశారు. తొలుత స్పెషల్ ఎడిషన్‌లో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు దీనిని 2013 టాటా నానోలో స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చారు. గ్లౌ బాక్స్‌కు పక్కనే స్టీరియో స్పీకర్లను కూడా జతచేశారు. ఈ కొత్త ఫీచర్లను గమనిస్తుంటే, 2013 టాటా నానో కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2013 టాటా నానో
పడిపోతున్న టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు, టాటా మోటార్స్ ఈ మోడల్‌లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

2013 టాటా నానో
ఇది వరకటి టాటా నానోతో పోల్చుకుంటే లుక్స్ పరంగా, ఫీచర్ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా కంపెనీ ఈ 2013 టాటా నానోను అభివృద్ధి చేయనుంది.

2013 టాటా నానో
టాటా నానోకు ప్రీమియం లుక్ కల్పించేందుకు వెనుక వైపు డోరు అంచుకు క్రోమ్ బార్‌ను అమర్చారు. అంతేకాకుండా, వెనుక బంపర్‌కు పైభాగంలో హనీ కోంబ్ గ్రిల్‌ను కూడా ఈ ఫోటోలలో గమనించవచ్చు.ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డుకు కుడి, ఎడమ వైపుల గ్లౌవ్ బాక్సును జతచేశారు. తొలుత స్పెషల్ ఎడిషన్‌లో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు దీనిని 2013 టాటా నానోలో స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చారు. గ్లౌ బాక్స్‌కు పక్కనే స్టీరియో స్పీకర్లను కూడా జతచేశారు.

టాటా నానో క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ స్కీమ్
టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు తాజాగా టాటా మోటార్స్ ఓ వినూత్న స్కీమ్‌ను పరిచయం చేసింది. క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ద్వారా టాటా నానో కారును కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జీరో పర్సెంట్ వడ్డీ వద్ద 3 నుంచి 12 నెలల వరకూ ఈఎమ్ఐ క్రిందకు మార్చుకునే అవకాశాన్ని టాటా మోటార్స్ కల్పిస్తోంది.

2012 టాటా నానో
వాస్తవానికి గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు తాజాగా టాటా మోటార్స్ ఓ వినూత్న స్కీమ్‌ను పరిచయం చేసింది. క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ద్వారా టాటా నానో కారును కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జీరో పర్సెంట్ వడ్డీ వద్ద 3 నుంచి 12 నెలల వరకూ ఈఎమ్ఐ క్రిందకు మార్చుకునే అవకాశాన్ని టాటా మోటార్స్ కల్పిస్తోంది. మరి ఈ కొత్త నానోతో అయినా అమ్మకాలు జోరందుకుంటాయో లేదో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








