నకిలీ ఫెరారీ కార్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ప్రతి వస్తువుకు నకిలీ వస్తువులు తయారవుతున్న రోజులివి. స్పెయిన్‌లో తాజాగా ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ వంటి కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లకు నకిళ్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు, ఆ దేశ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా నకిలీ ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ కార్లను విక్రయిస్తున్న మోసగాళ్ల బృందాన్ని అరెస్టు చేశామని స్పానిష్ పోలీసులు తెలిపారు.

నోరూరించే ధరకే ఇలాంటి లగ్జరీ కార్లను విక్రయిస్తుండటంతో బుర్రలేని కొందరు ప్రబుద్ధులు ముందు వెనుకా ఆలోచించకుండా ఇలాంటి కార్లను కొని మోసపోతున్నారు. ఈ కేసులో వాలెన్సియాకు చెందిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సాధరాణ కార్ల ఎక్స్టీరియర్లను మార్పు చేసి, వాటిని నకిలీ ఫెరారీలు, ఆస్టన్ మార్టిన్లుగా మార్చేసి వాటి ఒరిజినల్ ధరలో ఐదవ వంతు ధరకే సదరు మోడిఫైడ్ నకిలీ లగ్జరీ కార్లను విక్రయిస్తున్నారు ఈ మోసగాళ్లు.

Fake Ferrari Racket Busted In Spain

ఒరిజినల్ కార్లకు, నకిలీ కార్లకు అస్సలు పోల్చుకోలేని విధంగా వీటి ఇంటీరియర్లు ఎక్స్టీరియర్లను అచ్చుగుద్దినట్లుగా మోడిఫై చేయటంలో వీళ్లు బాగా చేయి తిరిగిన వాళ్లు. చివరకు నకిలీ ఇంజన్ వివరాలు కూడా ఒరిజినల్ ఇంజన్ వివరాలతో మ్యాచ్ అయ్యేలా చేస్తారంటే వీళ్లెంతటి ఘరానా మోసగాళ్లో ఇట్టే అర్థమవుతుంది.

ఈ సూపర్ కార్లను కేవలం 40,000 యూరోలకే (మన దేశ కరెన్సీలో సుమారు రూ.32 లక్షలకు పైగా) విక్రయిస్తుండటంతో వీరిపై అనుమానం వచ్చిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గ్యారేజ్‌లో ఉన్న 17 నకిలీ ఫెరారీ కార్లను, 2 ఆస్టన్ మార్టిన్ కార్లను సీజ్ చేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2013, 11:02 [IST]
English summary
The spanish police, earlier this week, busted a fake car racket in which eight people were arrested and charged. Replica cars are actually quite common, but most of the time the people building replica models of Ferraris, Lamborghinis or other rare vintage models, do so for their personal use. If other wise it could be termed as copyright infringement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+