12 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ఫిబ్రవరి కార్ల అమ్మకాలు

డిసెంబర్ 2000 సంవత్సరంలో కార్ల అమ్మకాలు 40 శాతం తగ్గాయని, అప్పటి నుంచి చూస్తే ఇంత భారీ క్షీణత నమోదు కావటం ఇదే మొదటిసారని ఆయన వివరించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక వడ్డీరేట్లు, కనిష్ట స్థాయిలో ఉన్న వినియోగదారుల సెంటిమెంట్ మొదలైన అంశాలు అమ్మకాలపై తీవ్రప్రభావం చూపాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు రుణాత్మక వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అంచనా వేశారు.
సియామ్ గతంలో ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధి 0-1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, ప్రస్తుత మార్కెట్ తీరును గమనిస్తుంటే ఈ వృద్ధి కూడా అసాధ్యమని అర్థమవుతోంది. దేశపు అగ్రగామి కార్ కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీల అమ్మకాలు సైతం తగ్గుముఖ పడుతున్నాయి. గడచిన నెలలో మారుతి అమ్మకాలు 11 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 7శాతం, టాటా మోటార్స్ అమ్మకాలు మూడు రెట్లు తగ్గాయని ఆయన తెలిపారు.
కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14, మొత్తం మీదుగా చూసుకుంటే ఇది వాహనరంగానికి సానుకూలంగానే ఉందని, అయితే ఈ బడ్జెట్‌లో ఎస్‌యూవీలపై సుంఖాలను పెంచడంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉందని సేన్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు మెరుగుపడవచ్చని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








