ఫెరారీ 458 స్పెషల్ తొలి వీడియో టీజర్ విడుదల

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ అందిస్తున్న ఫెరారీ 458 ఇటాలియాకు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా రానున్న 'ఫెరారీ 458 స్పెషల్' (Ferrari 458 Speciale)ను హై-రెజల్యూషన్ ఫొటోలను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు తాజా ఈ సూపర్‌కారు సంబంధించి ఓ కొత్త వీడియోను విడుదల చేసింది. ఫెరారీ 458 ఇటాలియా విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది.

ఫెరారీ 458 స్పెషల్ (ఇటాలియన్ భాషలో దీనిని 'ఫెర్రారీ 458 స్పిచాలే' అని పిలుస్తారు) సూపర్ కారును వచ్చే నెలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు.

ఫెరారీ విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో త్వరలో విడుదల కానున్న ఫెరారీ 458 స్పెషల్ కారులోని అన్ని డీటేల్స్‌ను (ఇంటీరియర్ లుక్‌తో కలిపి) చూడొచ్చు. ఫెరారీ 430 స్కూడెరియాకు సక్సెసర్‌గా వస్తున్న మోడలే ఈ 458 స్పెషల్. ఇది ప్రస్తుతం లభిస్తున్న 458 ఇటాలియా మోడల్ కన్నా లైట్‌గా ఉండటమే కాకుండా, దానికన్నా మరింత శక్తివంతంగా ఉంటుంది. మరి ఈ టీజర్ వీడియోను మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/eUEcWmIw4SE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
ఫెరారీ 458 స్పెషల్‌లో ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. 458 ఇటాలియాలో ఉపయోగించిన 562 హార్స్ పవర్, 4.5 లీటర్, వి8 ఇంజన్‌నే ఈ కారులోను ఉపయోగించారు. అయితే, దీని పవర్‌ను మాత్రం కొద్దిగా పెంచి (597 హార్స్ పవర్‌కు) రీట్యూన్ చేశారు. ఇది కేవలం 3.0 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని, 9.1 సెకండ్ల వ్యవధిలోనే 0-200 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఫెరారీ 458 ఇటాలియాతో పోల్చుకుంటే ఫెరారీ 458 స్పెషల్ బరువు తక్కువగా ఉంటుంది. దీని మొత్తం బరువు 1290 కేజీలు మాత్రమే.

Ferrari 458 Speciale

More from DriveSpark

Article Published On: Saturday, August 24, 2013, 15:41 [IST]
English summary
After releasing high-res images of the upcoming 458 Speciale and giving us the details about the stripped down powerhouse, Ferrari has now come out with the first video previewing the supercar. The video, which is more of a teaser, provides close ups of various sections of the 458 Speciale, including the interior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+