జెనీవా మోటార్ షోలో ఫెరారీ కాలిఫోర్నియా రీప్లేస్‌మెంట్
ఫెరారీ ప్రియులకు ఓ శుభవార్త.. ఇక మీరు ఫెరారీ అందిస్తున్న పాపులర్ కారు 'కాలిఫోర్నియా' మార్కెట్ నుంచి తొలగిపోయిందని చింతించాల్సిన అవసరం లేదు. ఫెరారీ కాల్నిఫోర్నియా కారు స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ మరొక సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కారును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో ఫెరారీ తమ కాలిఫోర్నియా రీప్లేస్‌మెంట్ మోడల్‌ను ఆవిష్కరించనుంది. ఫెరారీ నుంచి లభ్యం కానున్న ఈ ఎంట్రీ లెవల్ మాస్ ప్రొడక్షన్ కారు ఫోల్డింగ్ రూఫ్ ఫీచర్‌లను అలాగే కలిగి ఉండనుంది. అయితే, పెర్ఫామెన్స్, విజువల్ మరియు ఎలక్ట్రానిక్ పరంగా ఇందులో అనే అప్‌డేట్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా అలాగే 458 ఇటాలియా మోడళ్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కాలిఫోర్నియా రీప్లేమెంట్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ కొత్త మోడల్‌లో మొత్తం అల్యూమినియం బాడీని ఉపయోగించిన కారణంగా ఇది ఫెరారీ కాలిఫోర్నియా కన్నా తేలికగా ఉండనుంది. అవుట్‌డేటెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా మోడ్రన్ సిస్టమ్‌తో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం.

ఈ మోడ్రన్ సిస్టమ్‌ను టెక్ దిగ్గజం యాపిల్‌తో చేతులు కలిపి ఐఓఎస్/సిరి ఇంటిగ్రేషన్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో మరో ప్రధానమైన మార్పు ఏంటంటే ఇంజన్. ఫెరారీ కాలిఫోర్నియా రీప్లేస్‌మెంట్ మోడల్‌లో టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. మాసేరటి క్వాట్రోపోర్టే, గిబ్లి మోడళ్లలో ఉపయోగిస్తున్న ఫెరారీ 3.8 లీటర్ వి8 ఇంజన్‌ను ఇందులో ఉపయోగిస్తారని తెలుస్తోంది.
మాసేరటిలో ఉపయోగించిన ఈ 3.8 లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 523 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాలిఫోర్నియా రీప్లేస్‌మెంట్‌లోని ఇంజన్ కూడా ఇంచు మించు ఇదే పవర్‌ను జనరేట్ చేసే ఆస్కారం ఉంది. అయితే, బెటర్ పెర్ఫామెన్స్ కోసం కాలిఫోర్నియాలో ఉపయోగించిన ఇంజన్‌నే దాని రీప్లేస్‌మెంట్‌లోను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు జెనీవా మోటార్ షోలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








