జెనీవాలో కొత్త హైపర్‌కారును విడుదల చేయనున్న ఫెరారీ

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ ఫెరారీ ఓ సరికొత్త హైపర్‌కారును త్వరోలనే ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. ఈనెల 5వ తేదీ నుంచి జరగనున్న 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో ఫెరారీ తమ కొత్త ఎన్జో కారును ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో, కొత్త ఫెరారీ ఎన్జో హైపర్‌కారుకు సంబంధించిన టీజర్ ఫోటోను కంపెనీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ఫెరారీ మార్కెట్లోకి తీసుకురానున్న ఈ కొత్త ఫెరారీ ఎన్జో హైపర్‌కారు, మెక్‌లారెన్ కంపెనీ విడుదల చేయనున్న మెక్‌లారెన్ పి1 కారుతో పోటీ పడనుంది. ఈ కొత్త కారులో 800 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే ఇంజన్ ఉండనుంది. ఇది సుమారు 1100 కేజీల బరువును కలిగి ఉండొచ్చని అంచనా. ఎఫ్150 కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేసిన ఈ హైపర్‌కారు నిర్మాణంలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించారు.

ఎన్జో ఆధారంగా రూపొందించిన 2005 ఎఫ్ఎక్స్ఎక్స్ ట్రాక్ కారు నుండి స్ఫూర్తి పొంది ఈ కొత్త ఎన్జోను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఫెరారీ ఎన్జో ధర 10 లక్షల బ్రిటీష్ పౌండ్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.8.3 కోట్లు. ఈ కొత్త కారుకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

New Ferrari Enzo

More from DriveSpark

Article Published On: Saturday, March 2, 2013, 15:11 [IST]
English summary
Italian supercar manufacturer Ferrari confirms it will unveil the new Enzo at Geneva motor show 2013. Ferrari has not indicated a price for the new Enzo yet, but it's likely to be around £1,000,000 (Rs 8.23 core). Stay tuned for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+