ఫియట్ జీప్‌లతో పాటుగా ఓ కొత్త క్రాసోవర్ కూడా వస్తోంది!

By Ravi

ఫియట్ ఇండియా వచ్చే ఏడాది దేశీయ విపణిలో తమ పాపులర్ 'జీప్' బ్రాండ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్లు మన ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. తాజా అప్‌డేట్ ప్రకారం, 2014 ఫియట్ జీప్‌లతో పాటుగా ఓ కొత్త ఫియట్ క్రాసోవర్ కూడా భారత మార్కెట్‌కు రానుంది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ విషయంలో టాటా మోటార్స్ నుంచి విడిపోయిన తర్వాత ఫియట్ ఇండియా, భారత్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరింపజేస్తోసంది.

ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఫియట్, ఇప్పుడు ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే, 2014 ఫియట్ ఇండియా నుంచి అనేక కొత్త మోడళ్లు భారత మార్కెట్‌కు రానున్నాయి. ఈ కొత్త మోడళ్ల ముందుగా, జీప్ బ్రాండ్ ఎస్‌యూవీలు వస్తాయి. వీటితో పాటుగా ఫియట్ బ్యాడ్జ్‌తో కూడిన ఓ కొత్త క్రాసోవర్ కూడా మార్కెట్లోకి తీసుకురానున్న కంపెనీ వర్గాల సమాచారం.

Fiat Jeep

ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో ఓ రగ్గడ్ వెర్షన్ క్రాస్‌పోలోను తయారు చేసినట్లుగా, ఫియట్ క్రాసోవర్ విషయంలో కూడా, దీనిని పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై కాకుండ, పుంటో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది. పుంటోలో ఉపయోగించిన 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌నే రీట్యూన్ చేసి ఈ కొత్త క్రాసోవర్‌లో ఉపయోగించే ఆస్కారం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫియట్ ఇండియా తమ కొత్త క్రాసోవర్‌ను రంజన్‌గావ్‌లోని ఉత్పత్తి కేంద్రంలో స్థానికంగా ఉత్పత్తి చేయనుంది. ఈ క్రాసోవర్ తయారీలో ఎక్కువ భాగం స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించడం ద్వారా దీని ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ యోచిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 3, 2013, 10:12 [IST]
English summary
Fiat India, which presently sells only the Punto hatchback, Linea sedan and the lower end, Classic version of the sedan plans to expand its lineup next year, starting with a crossover and two Jeep models, which of course will be imported.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+