బెంగుళూరులో ఫియట్ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్ ప్రారంభం

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం నుంచి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల విక్రయం కోసం ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌లను శరవేగంగా ప్రారంభింస్తోంది. ఇటీవలే న్యూఢిల్లీలో తమ రెండవ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన ఫియట్ ఇండియా తాజాగా దేశ ఐటి రాజధాని బెంగుళూరులో ఓ అధునాతన ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది.

ఈ మేరకు బెంగుళూరులో 'కెహెచ్‌టి ఫియట్'ను తమ అధీకృత డీలర్‌గా నియమించుకున్నామని కంపెనీ పేర్కొంది. కెహెచ్‌టి ఫియట్ షోరూమ్ బెంగుళూరోని కోరమంగళ వద్ద అమర్‌జ్యోతి లేఅవుట్ వద్ద ఏర్పాటు చేశారు (పూర్తి చిరునామా క్రింద ఇవ్వబడినది). ఇక్కడ ఫియట్ షోరూమ్‌తో పాటుగా 'ఫియట్ కెఫే'ను కూడా ప్రారంభించారు. 6,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన షోరూమ్‌లో నాలుగు కార్లను ప్రదర్శనకు ఉంచేంత స్థలం ఉంటుంది. అంతేకాకుండా, 9,000 చ.అ. విస్తీర్ణంలో వర్క్‌షాప్‌ను కూడా ప్రారంభించారు.

KHT Fiat,
No 92, Amarjyothi Lay Out,
Koramangala, Intermediate Ring Road,
Bengaluru - 560071.

FIAT India Inaugurates Exclusive Dealership In Bengaluru

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2013, 14:36 [IST]
English summary
Fiat India has inaugurated its exclusive dealership and its first Fiat Caffe at Bengaluru. KHT Fiat, the new exclusive Fiat dealership, is located at No 92, Amarjyothi Lay Out, Koramangala, Intermediate Ring Road, Bengaluru - 560071.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+