ఢిల్లీలో 2వ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన ఫియట్

By Ravi

ఇటలీకు చెందిన ఫియట్, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ భాగస్వామ్యం నుంచి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో ఒంటరి ప్రయాణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫియట్ తమ ఉత్పత్తులను దేశీయ విపణిలో విక్రయించేందుకు ఎక్స్‍‌‌క్లూజివ్ డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫియట్ ఇండియా న్యూఢిల్లో తమ రెండవ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.

న్యూఢిల్లీలోని కష్యప్ ఫియట్‌ను తమ అధీకృత డీలర్‌గా నియమించుకుంటున్నట్లు ఫియట్ ఇండియా పేర్కొంది. ఈ డీలర్‌షిప్‌ను న్యూఢిల్లీలోని 212, ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్ 3 వద్ద ఏర్పాటు చేశారు. ఈ డీలర్‌షిప్ సేల్స్, సర్వీస్, స్పేర్స్ సేవలను కంపెనీ అందిస్తోంది. ఇందులో ఏక కాలంలో 30 వాహనాలను సర్వీస్ చేసే సామర్థ్యం ఉంది.

సుమారు 11,000 చ.అ. విస్తీర్ణంలో ఈ డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 5,000 చ.అ. విస్తీర్ణంలో 5 కార్లను ప్రదర్శించేందుకు ఫ్లోర్ స్పేస్‌ను కేటాయించారు. ఈ డీలర్‌షిప్‌లో గ్రాండే పుంటో హ్యాచ్‌బ్యాక్, లీనియా సెడాన్‌లతో పాటుగా ఓ క్లాసిక్ ఫియట్ టోపోలినో కారును కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇందులో పోలో షర్టులు, కప్పులు, ఘడియారాలు వంటి ఫియట్ మర్చైండైస్‌లను కూడా ఉంచారు.

Fiat India Opens 2nd Exclusive 3S Dealership In Delhi

More from DriveSpark

Article Published On: Saturday, May 11, 2013, 16:45 [IST]
English summary
Fiat India has inaugurated its second exclusive dealership, Kashyap Fiat, in New Delhi. Located at 212, Okhla Industrial Estate, Phase - III, the 3S facility has a capacity of servicing 30 vehicles in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+