ఆగస్ట్ 14న 2013 ఫియట్ పుంటో స్పోర్ట్ విడుదల
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ పుంటోలో స్పోర్ట్ వెర్షన్‌ను ఈనెల 14న విడుదల చేయనుంది. ఫియట్ పుంటో స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇప్పటికే మీడియాకు ఆహ్వానాలు పంపించింది. బెంగుళూరులో ఆగస్ట్ 14, 2013వ తేది సాయంత్రం నాలుగు గంటలకు ఫియట్ పుంటో స్పోర్ట్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తమ ఆహ్వానంలో పేర్కొంది. (పుంటో స్పోర్ట్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి).
ఫియట్ ఇండియా ఇండిపెండెన్స్ డే ప్లాన్స్
ఇదిలా ఉండగా, ఫియట్ ఇండియా 67వ స్వాతంత్ర్యో దినోత్సవాన్ని పురస్కరించుకొని 'ఫ్రీడమ్ డ్రైవ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కస్టమర్లు తాము ఎంపిక చేసుకునే లొకేషన్‌కు ఫియట్‌లో మూడు రాత్రులుడ్రైవ్ చేయవచ్చు. ఈ ఆఫర్ విభిన్న ఎక్సేంజ్ ప్యాకేజీలతో లభిస్తుంది. ఇందులో కస్టమర్లు రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

అంతేకాకుండా, ఆగస్ట్ 14, 15 తేదీలలో ఫియట్ లీనియా, పుంటో కార్లను బుక్ చేసుకునే కస్టమర్లు ఉచిత అశ్శూర్డ్ గిఫ్ట్‌లను కూడా పొందవచ్చు. ముంబై, పూనే, ఛండీఘడ్, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఫియట్ తమ 'పిట్ స్పాట్'ల ద్వారా ఉచిత వెహికల్ చెకప్‌లను కూడా అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలో అధీకృత ఫియట్ డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








