క్రైస్లర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోనున్న ఫియట్

By Ravi

Fiat Will Take Over Chrysler
ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్, డెట్రాయిట్‌కు చెందిన క్రైస్లర్‌లో తన వాటాను స్థిరంగా పెంచుకుంటూ పోతుంది. 2009లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో దివాళా స్థాయికి చేరుకున్న క్రైస్లర్‌ను ఫియట్ ఆదుకుంది. అప్పటి నుంచి క్రైస్లర్‌లో ఫియట్ వాటా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే, తాజాగా క్రైస్లర్‌లోని పూర్తి వాటాలను కొనుగోలు చేయటం ద్వారా సదరు సంస్థను స్వాధీనం చేసుకోవాలని ఫియట్ భావిస్తోంది.

ప్రస్తుత క్రైస్లర్‌లో ఫియట్‌కు 61.8 (వికిపీడియా) శాతం వాటా ఉంది. ఇది జులై 2011లో అమెరికా ప్రభుత్వం నుంచి షేర్లను కొనుగోలు చేసిన తర్వాత. కాగా, ఇందులో మిగిలిన వాటాలను కొనుగోలు చేయటం ద్వారా క్రైస్లర్‌ను పూర్తిగా తమలో విలీనం చేసుకోవాలని ఫియట్ యోచిస్తోంది. ఇందుకోసం అమెరికాకు చెందిన లేబర్ యూనియన్ యునైటెడ్ ఆటో వర్కర్స్‌తో ఫియట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అయితే, ఈ వాటా విలువపై వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇది సుమారు రూ.20,000 కోట్లు ఉండచ్చని అంచనా. ఫియట్ మాతృ సంస్థ ఎక్సర్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్‌స్పెక్షన్ సంస్థ ఎస్‌జిఎస్‌లోని తన 15 శాతం వాటాను రూ.11,099 కోట్ల లాభానికి విక్రయించింది.

ఈ డీల్ పూర్తయితే, అమెరికా మార్కెట్లో ఫియట్ రాణించేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఈ మిగిలిన వాటాలను కొనుగోలు చేసేందుకు సుమారు 3.5 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ఫియట్ ప్రస్తుతం నిధులను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఈ వేసవి చివరి నాటికి ఫియట్ ద్వారా క్రైస్లర్ టేకోవర్ ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. క్రైస్లర్ అప్పును కొనుగోలు చేసి దానిని ఫియట్ అప్పుతో కలిపి తక్కువ వడ్డీ రేటుకే దానిని తిరిగి చెల్లించవచ్చని ఫియట్ భావిస్తోంది.

ఈ టేకోవర్ ప్రక్రియ ద్వారా ఫియట్ తమ స్వంత దేశమైన ఇటలీని వదిలిపెట్టి అమెరికాకు తరలిపోతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఇటలీలలోని ఫియట్ ఉద్యోగులు రోడ్డున పడే ఆస్కారం ఉంది. అసలే పడిపోతున్న ఆర్థికవ్యవస్థతో ఇబ్బంది పడుతున్న ఇటలీకి ఇదొక మేజర్ షాక్‌గా మారే అవకాశం ఉంది. అయితే, తాజా రిపోర్ట్ ప్రకారం, ఫియట్ అధినేత సెర్గియో మార్చియోన్ తమ ప్రధాన కార్యాలయాన్ని అమెరికాకు మార్చే యోచన లేదని ఇటలీ ప్రధానమంత్రి ఫ్లేవియో జోనోనటోకు హామీ ఇచ్చారట. క్రైస్లర్‌ను కొనుగోలు చేసిన ఇటలీలోనే ఉంటామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2013, 17:05 [IST]
English summary
In the last few weeks news has been raft about Fiat's plans to completely acquire American car brand Chrysler. The Italian automaker holds 61.8 percent stake (Wikipedia) in Chrysler. This, after it bought shares from the US government in July 2011. The remaining part is held by United Auto Workers, an American labour union.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+