ఫోర్డ్ సెలబ్రేషన్స్ ప్రారంభం: కార్లపై భారీ ప్రోత్సాహకాలు
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, భారత్‌లో సంబరాలు జరుపుకుంటుంది. ఈ సంబరాలను పురస్కరించుకొని 'ఫోర్డ్ సెలబ్రేషన్స్' పేరిట తమ ఉత్పత్తులపై కంపెనీ భారీ ప్రోత్సాహకాలను అందిస్తుంది. మార్చి 7, 2013 నుంచి మార్చి 9, 2013 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో కంపెనీ అందిస్తున్న ఫిగో, ఫియస్టా క్లాసిక్, ఫియస్టా, ఎండీవర్ మోడళ్లపై వివిధ తగ్గింపులు, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తుంది. ఫోర్డ్ ఇండియా తమ కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫోర్డ్ ఫిగోపై రూ.37,000 వరకూ సేవింగ్స్ (ప్రారంభ ధర రూ.3.89 లక్షలు)
- ఫోర్డ్ క్లాసిక్‌పై రూ.49,000 వరకూ సేవింగ్స్ (ప్రారంభ ధర రూ.5.64 లక్షలు)
- ఫోర్డ్ ఫియస్టాపై రూ.74,000 వరకూ సేవింగ్స్ (ప్రారంభ ధర రూ.7.42 లక్షలు)
- ఫోర్డ్ ఎండీవియర్‌పై రూ.97,000 వరకూ సేవింగ్స్ (ప్రారంభ ధర రూ.19.12 లక్షలు)



Click it and Unblock the Notifications








