రూ.50,000 లకే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బుకింగ్

ఇప్పటికే ఫోర్డ్ ఇండియా తమ చెన్నై ప్లాంటులో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించడంతో డెలివరీలు కూడా వీలైనంత త్వరగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను ఈ వచ్చే మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ విడుదల చేసే ఆస్కారం ఉంది. యూనియన్ బడ్జెట్ 2013లో చిన్న కార్లపై ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను పరిశీలించిన తర్వాత ఈ మోడల్ ధరను నిర్ణయించాలని కంపెనీ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరసమైన ధరకే ఈకోస్పోర్ట్‌ను విడుదల చేయటానికే కంపెనీ ఈ కారను భారత మార్కెట్లో విడుదల చేయటంలో జాప్యం వహిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ మోటార్స్ అభివృద్ధి చేసిన ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. దేశీయ విపణిలో పోర్డ్ ఈకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇందులో ఫోర్డ్ తాజాగా అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, అధిక పెర్ఫామెన్స్‌ను, ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.
బ్రెజిల్ మార్కెట్లో లభ్యమవుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్లూటూత్ వాయిస్ కమాండ్స్, ఎల్ఈడి లైట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బాడీ కలర్డ్ బంపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ విండోస్, పార్కింగ్ సెన్సార్స్, ట్రిప్ కంప్యూటర్, టిసిఎస్, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ ఫంక్షన్, లెథర్ సీట్స్ వంటి సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి. ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1 లీటర్, 3-సిలిండర్ ఈకో బూస్ట్ ఇంజిన్ అమర్చనున్నారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








